ఒరిస్సా రాష్ట్రానికి చెందిన నిరుద్యోగులకు విజయనగరంలోని లైఫ్ లైన్ ఏజెన్సీ టోకరా వేసింది. సుమారు 125 మంది నుంచి 75 లక్షల రూపాయలను వసూలు చేసినట్లు తెలుస్తుంది. దుబాయిలో ఉన్న సామ్ సంగ్ కంపెనీలో ఉద్యోగం పేరిట ఒరిస్సా పేపర్ లో నోటిఫికేషన్ వేసి.. విజయనగరం కార్యాలయంలో లైప్ లైన్ ఏజెన్సీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇక, డబ్బులు చెల్లించిన వారికి వీసాలు ప్రింట్ చేసి ఇచ్చేసిన లైఫ్ లైన్ ఏజెన్సీ ప్రతినిధులు.. నిరుద్యోగుల నుంచే దుబాయ్ కి టిక్కెట్లను సంస్థ ప్రతినిధులు బుక్ చేయించారు.
Read Also: Aishwarya Rai: ఐశ్వర్య.. 12 ఏళ్లకే కూతురికి సర్జరీ చేయించిందా.. ?
ఇక, ఈనెల 5వ తేదీన ప్రయాణం అని లైఫ్ లైన్ ఏజెన్సీ ప్రతినిధులు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన నిరుద్యోగులకు వెల్లడించారు. అయితే, తీరా బట్టులు సరుద్దుకు వచ్చే సరికి లైఫ్ లైన్ ఏజెన్సీ సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. బాధితులందరూ పూరి, బలగాం, ఖుర్దా ప్రాంతం వారుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు గుర్తించారు. ఇలాంటి వాటిని నమ్మొద్దని వారు సూచించారు. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టమని పోలీసులు పేర్కొన్నారు.