Murder: అందరూ చూస్తుండగానే కాల్పులు.. ఆపై..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా మహారాష్ట్రలో ఓ దారుణ హత్య చోటుచేసుకుంది. సోలాపూర్ – పూణే జాతీయ రహదారిపై ఈ సంఘటన చోటుచేసుకుంది. హైవే లో ఉన్న ఓ రెస్టారెంట్ లో అందరూ చూస్తుండగానే ఇద్దరు దుండగులు ఓ వ్యక్తి దగ్గరికి వచ్చి కాల్పులు చేశారు. ఒక వ్యక్తి తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఓ టేబుల్ వద్ద ఉండగా.. అక్కడికి ఆ వ్యక్తి పై ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్పులు చేశారు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే టేబుల్ పై కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత మరికొందరు దండగులు రాగా వారు కత్తితో విచక్షణా రహితంగా పొడిచారు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు రెస్టారెంట్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజీల్లో నమోదయ్యాయి. ఇవి కాస్త సోషల్ మీడియాలో రాగా బాగా వైరల్ గా మారాయి.
Also Read: Viral News: ‘‘గూగుల్ ఈజ్ రాంగ్’’.. ప్రయాణికుల్ని హెచ్చరించేందుకు సైన్‌బోర్డ్..
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ఇక మృతుడి విషయానికి వస్తే.. 34 యేళ్ల రియల్ ఎస్టేట్ చేసే అవినాశ్ బాలు ధాన్వేగా గుర్తించారు. ఈ కాల్పులు రెండు గ్యాంగుల మధ్య శత్రుత్వంగా పోలీసులు అనుమానం వ్యక్తపరుస్తున్నారు . హత్య జరిగిన సమయంలో ధాన్వేతోపాటు మరో వ్యక్తులు రెస్టారెంట్ లోని టేబుళ్ల వద్ద కూర్చొని ఉన్నారు. అంతే కాదు వారి సమీపంలో మరో టేబుల్ వద్ద ఇద్దరు పిల్లలతో కూడిన ఓ కుటుంబం భోజనం చేస్తుంది కూడా. మొదటగా ఓ ఇద్దరు వ్యక్తులు నెమ్మదిగా నడుచుకుంటూ రెస్టారెంట్ లోకి రాగా.. వారిలో ఒకరి చేతిలో ప్లాస్టిక్ బ్యాగ్ ఉన్నట్లు గమనించవచ్చు. ఆ తర్వాత తుపాకులు తీసి అక్కడే ఫోనులో మాట్లాడుతున్న ధాన్వే తలపై కాల్పులు జరిపారు. ఆ దెబ్బకి భయపడిన ధాన్వే, అతనితో కలిసి ఉన్న ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు.
Also Read: Praja Galam: చిలకలూరిపేటలో ప్రజాగళం సభ.. మోడీ ప్రసంగంపైనే సర్వత్రా ఆసక్తి
ఆ తదుపరి రెస్టారెంట్ లోకి మొత్తం ఆరుగురు వ్యక్తులు ప్రవేశించి నేలపై పడిపోయిన ధాన్వేను పట్టుకుని కత్తితో పొడిచి, ఆ తర్వాత కిరాతకంగా గొంతు కోసి చంపేశారు. దాంతో పక్కనే మరో టేబుల్ లో భోజనం చేస్తున్న ఓ కుటుంబ ప్రాణభయంతో పారిపోవడం కూడా సీసీటీవీ దృశ్యాల్లో గమనించవచ్చు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి., పూర్తి విచారణ జరుపుతున్నారు. హంతకుల ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!