జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో జరిగిన ప్రమాదం కేసులో కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. రెండు సంవత్సరాల క్రితం రోడ్డు నెంబర్ 45లో జరిగిన కారు ప్రమాదంలో బీఆర్ఎస్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహీల్ కారు నడిపినట్లు గుర్తించారు.
పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నాయకుడుకి సంబంధించిన కేవీఆర్ సూపర్ మార్ట్ లో భారీ మొత్తంలో చీరలు ఉన్నాయని ఎన్నికల అధికారికి టీడీపీ శ్రేణులు ఫిర్యాదు చేశారు.
భారతదేశంలో చాలామందికి సివిల్ సర్వీసును క్రాక్ చేసి ప్రజలకు సేవ చేయాలన్నదే కోరిక. కాకపోతే ఇది అందరికీ సాధ్యం కాదు. కృషి, పట్టుదల, తెలివితేటలు ఉన్నవారు మాత్రమే ఈ పోస్టులను సాధిస్తారు. నిజానికి ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే అంత ఆషామాసి విషయం కాదు. అలాంటిది ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ముళ్లు సివిల్ సర్వీసును క్రాక్ చేసారు. వారెవరో కాదు.. బిహార్కు చెందిన వివేక్ సహాయ్, వికాస్ సహాయ్. Also Read: TDP MP Candidates…
నల్గొండ జిల్లా మిర్యాల గూడలో భారీగా బంగారం పట్టుబడింది. సోమవారం లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో.. ఈదులగూడ చౌరస్తా వద్ద తనిఖీలు చేస్తుండగా.. మిర్యాలగూడ టౌన్ నుంచి కోదాడ వైపు వెళ్తున్న బొలెరో వాహనంలో రూ.5.73 కోట్లు విలువ చేసే 13 కిలోల బంగారం పట్టుకున్నారు. బంగారం, వాహనాన్ని స్వాధీనం చేసుకుని.. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.. కాగా.. బంగారం, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.…
తిరుపతి జిల్లాలో మొత్తం 2,136 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. ఇక, జిల్లా వ్యాప్తంగా 17, 94, 733 మంది ఓటర్లు ఉన్నారు.. అందులో పురుష ఓటర్లు - 8,74,738 మంది ఉండగా, స్త్రీలు - 9,19,817 మంది ఉన్నారు.
చాలా రోజుల తర్వాత చెడ్డీ గ్యాంగ్ సంచారం మళ్లీ కలకలం రేపుతోంది. శనివారం అర్ధరాత్రి మియాపూర్లో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేసింది. వరల్డ్ వన్ స్కూల్ లోకి కొంతమంది చెడ్డీలు ధరించి.. ముఖానికి మాస్క్ కట్టుకుని పదునైన ఆయుధాలతో ఒంటిమీద బట్టలు లేకుండా చొరబడ్డారు. అనంతరం స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో గల కౌంటర్ లో ఉన్న 7 లక్షల 85 వేల నగదును దొంగలు దోచుకెళ్లారు.
తాజాగా మహారాష్ట్రలో ఓ దారుణ హత్య చోటుచేసుకుంది. సోలాపూర్ – పూణే జాతీయ రహదారిపై ఈ సంఘటన చోటుచేసుకుంది. హైవే లో ఉన్న ఓ రెస్టారెంట్ లో అందరూ చూస్తుండగానే ఇద్దరు దుండగులు ఓ వ్యక్తి దగ్గరికి వచ్చి కాల్పులు చేశారు. ఒక వ్యక్తి తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఓ టేబుల్ వద్ద ఉండగా.. అక్కడికి ఆ వ్యక్తి పై ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్పులు చేశారు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే టేబుల్ పై…
ఓ మహిళ తన స్నేహితులతో కలిసి ఓ ఫేమస్ రెస్టారెంట్ కి వెళ్ళింది. అక్కడ అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ.. తినడానికి దోశను ఆర్డర్ చేశారు. ఆ తర్వాత వచ్చిన దోశను తింటుండగా అనుమానం రావడంతో దోశను నిశితంగా పరిశీలించింది. అలా చూసిన ఆవిడ షాక్ కు గురైంది. హోటల్ వాళ్ళు ఇచ్చిన దోశలో ఏకంగా 8 బొద్దింకలు కనబడ్డాయి. ఈ సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఈ సంఘటన గురించి సదరు మహిళ విషయాన్ని సోషల్ మీడియాతో…