భారతదేశంలో చాలామందికి సివిల్ సర్వీసును క్రాక్ చేసి ప్రజలకు సేవ చేయాలన్నదే కోరిక. కాకపోతే ఇది అందరికీ సాధ్యం కాదు. కృషి, పట్టుదల, తెలివితేటలు ఉన్నవారు మాత్రమే ఈ పోస్టులను సాధిస్తారు. నిజానికి ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే అంత ఆషామాసి విషయం కాదు. అలాంటిది ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ముళ్లు సివిల్ సర్వీసును క్రాక్ చేసారు. వారెవరో కాదు.. బిహార్‌కు చెందిన వివేక్ సహాయ్, వికాస్ సహాయ్.
Also Read: TDP MP Candidates List: సిద్ధమైన టీడీపీ ఎంపీల జాబితా..! ఈ రోజే విడుదలకు ఛాన్స్..
ఇందులో ఇద్దరు అన్నదమ్ముళ్లు ఐపీఎస్‌లు కాగా మరొకరు ఐఆర్ఎస్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో కేవలం ఐపీఎస్ లు అవ్వడమే కాదు.. రెండు వేర్వేరు రాష్ట్రాలకు డీజీపీ లుగా నియమితులవ్వడం విశేషం. పోలీస్ శాఖ చరిత్రలోనే ఇలా జరగడం మొదటిసారి. ఇద్దరిలో ఒకరు ఏడాది కాలంగా డీజీపీ పని చేస్తుండగా.. మరొకరు సోమవారమే డీజీపీగా బాధత్యలు చేపట్టారు.
Also Read: SS Rajamouli : ఆర్ఆర్ఆర్ మూవీ రాజమౌళి ఒరిజినల్ వెర్షన్ కాదా.. అన్ని మార్పులు చేసారా..?
బిహార్ రాష్ట్రానికి చెందిన సహాయ్ కుటుంబంలో మొత్తం ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగాలను సంపాదించగా.. అందులో వివేక్ సహాయ్ 1988 బ్యాచ్, వికాస్ సహాయ్ 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారులు. ఇక మరొక సోదరుడు విక్రమ్ సహాయ్ 1992 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి. గత సంవత్సర కాలంగా గుజరాత్ రాష్ట్రానికి డీజీపీగా వికాస్ సహాయ్ సేవలందిస్తుండగా.. సోమవారం నాడు వివేక్ బెంగాల్ రాష్ట్ర డీజీపీగా నియమితులయ్యారు. ఈ పోస్ట్ కు సంబంధించి ముగ్గురు పేర్లను ఎన్నికల సంఘానికి పంపగా.. వారిలో వివేక్ సహాయ్ ను బంగాల్ డీజీపీగా నియమిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా అన్నదమ్ములిద్దరూ రెండు వేర్వేరు రాష్ట్రాలకు ఒకే సమయంలో డీజీపీ లుగా సేవలు అందించబోతున్నారు. ఇక వివేక్ ఈ ఏడాది చివర్లో పదవి విరమణ చేయనున్నారు.