హైదరాబాద్ మల్కాజ్గిరిలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ప్రధాని మోడీ ఈరోజు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ప్రధాని మోడీ విజయ సంకల్ప రోడ్ షో చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర బలగాలతో భారీ భద్రత నిర్వహించనున్నారు. మల్కాజ్గిరిలో మోడీ రోడ్ షో 1.3 కిలోమీటర్, గంట పాటు సాగనుంది. అందుకోసమని.. రెండు వేలకు పైగా10 అంచెల పోలీస్ భారీ భద్రత చేపట్టనున్నారు.
ఈ క్రమంలో.. మోడీ రోడ్ షో రూట్ మ్యాప్ ను SPG కమాండో టీం ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రధాని షాడో సెక్యూరిటీగా 60 మందికి పైగా SPG ఉన్నత కమాండోస్, మరో రెండు అంచెలలో 10+ NSG కమాండోస్ టీం ఏర్పాటు చేశారు. ప్రధాని మోడీ రోడ్ షో.. సాయంత్రం 5.15 నిమిషాలకు మీర్జాలగూడ నుండి మొదలై గంటసేపు పాటు మల్కాజ్ గిరి వరకు జరగనుంది. ఈ సందర్భంగా.. ప్రధాన రహదారులకు ఇరువైపులా భారీకేడ్లు ఏర్పాటు చేశారు.
Read Also: Weather warning: తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు.. ఈ తేదీల్లో వర్షాలు
అంతేకాకుండా.. రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపులు మూసి వేశారు. ప్రధాని మోడీ రోడ్ షో ఉండటంతో.. SPG బృందం ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించింది. SPG కమాండోస్ తో సెంట్రల్ ఇంటెలిజెన్స్ సిటీ సెక్యూరిటీ వింగ్, ఇంటలిజెన్స్ కేంద్ర బలగాలు కోఆర్డినేషన్ చేస్తున్నాయి. 1.5 కిలో మీటర్ సాగే రోడ్ షో కోసం సీసీ కెమెరాల ద్వారా భద్రతా పర్యవేక్షిస్తున్నారు.