పురాతన కాలంలో ప్రజలు భూమిలోపల గుహలు తయారు చేసుకుని ఆశ్రయం పొందేవారు. ఇప్పుడున్న రోజుల్లో అలాంటి గుహలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అయితే బీహార్లో ఇలాంటి గుహలను అక్కడి జనాలు చూశారు. ఈ గుహలో వెతకగా ప్రజలు ఆశ్చర్యపోయారు. అందులో భారీగా మద్యం ఉండటాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
కాసేపట్లో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి జంటనగరాల్లో వైన్ షాపులు క్లోజ్ అవనున్నాయి. అంతేకాకుండా.. బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని వైన్ షాపులకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కాగా.. హోలీ సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్ తో పాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మద్యం అమ్మకాలు జరగొద్దని మద్యం దుకాణాలు మూయాలని సూచించారు. మరోవైపు.. స్టార్ హోటల్స్, రిజిస్టర్డ్ క్లబ్బులు యథావిధిగా నడవనున్నాయి. ఈమేరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ…
ఓ యువకుడు పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ దారుణానికి సిద్ధపడ్డాడు. యువకుడు బాలికపై ఏకంగా కత్తితో దాడి చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని ముఖర్జీ నగర్ లో లైబ్రరీ కి వెళ్తున్న ఓ బాలికపై 22 ఏళ్ల అమన్ దాడి చేశాడు. ఈ ఘటన శుక్రవారం నాడు జరగాగా విషయం కాస్త లేటుగా బయటకు వచ్చింది. అయితే ఈ దాడికి సంబంధించిన విషయం తెలుసుకొని పోలీసులు నిందతుడిని అరెస్టు చేశారు.…
విశాఖపట్నంలో డ్రగ్స్ అక్రమ రవాణాపై విశాఖ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోషియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సంధ్య ఆక్వా ఎక్స్ పోర్ట్ ఎఫెక్ట్ తో మత్స్య ఎగుమతులకు తీవ్ర విఘాతం కలుగుతోంది అని ఆవేదన వ్యక్తం చేసింది. ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే ఉత్పత్తులపై నిషేధం విధించే ప్రమాదం ఏర్పడింది అని పేర్కొన్నారు.
విశాఖపట్నం డ్రగ్ కంటైనర్ కేసు విచారణలో సీబీఐ అధికారులకి కొత్త డౌట్స్ వస్తున్నాయి. నాలుగు రోజుల విచారణలో కీలక ఆధారాలు లభ్యం అయ్యాయి. ఆరు రకాల నిషేధిత సింథటిక్ డ్రగ్స్ అవశేషాలు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఇదివరకే పూర్తయ్యాయి. మార్చి 1 నుండి 20 వరకు జరిగిన ఈ పరీక్షలకు వోకేషనల్ కోర్స్ తో కలిపి 10,52,673 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 52,900 విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వలేదు. 75 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో మాల్ ప్రాక్టీస్ కు ప్రయత్నించారు. వీటికి సంబంధించి వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఇంటర్మీడియట్ సంబంధించిన ఇంటర్ సమాధాన పత్రాలు మూల్యాంకనం కూడా మొదలైంది.…
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. విజయవాడ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు భారీగా నగదును సీజ్ చేశారు. ఓ కారులో నగదు తీసుకువెళుతుండగా అధికారులు పట్టుకున్నారు. పట్టుబడ్డ నగదు.. సుమారు కోటి 50 లక్షలు ఉన్నట్లు సమాచారం.