కర్ణాటక రాష్ట్రం బాగేపల్లిలో దారుణం జరిగింది. ఐదుగురు కుమార్తెలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అందరూ విషం తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. బాధితులను చిక్కబల్లాపూర్ ఆస్పత్రికి తరలించారు. తల్లి అనిత, చిన్నారులు లావణ్య, ధరణి, కావ్య, రక్షిత, శ్రీవల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చిన్నారుల ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తల్లి అనిత పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు సమాచారం. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Game Changer: రామ్ చరణ్ షర్ట్ పై ఇది గమనించారా?.. మీమ్స్ వైరల్..
ఆత్మహత్యకు భర్త గోపాల్ వేధింపులు కారణంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 12 ఏళ్ల క్రితం చిలమత్తూరు మండలం మరవకొత్తపల్లికి చెందిన గోపాల్‌తో బాగేపల్లికి చెందిన అనితతో వివాహం జరిగింది. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె.. పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఇది కూడా చదవండి: Purandeswari: ఏపీలో బీజేపీకి ఇంకొన్ని సీట్లు పెరుగుతాయని ఆశిస్తున్నాం..