Madhya Pradesh: నేను చలాన్ కట్టను, ఎస్పీకి చెప్పండి.. మహిళా ఇన్‌స్పెక్టర్‌తో ఓ వ్యక్తి వాగ్వాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళా ఇన్‌స్పెక్టర్‌తో ఓ బడా వ్యాపారవేత్త వాగ్వాదానికి పాల్పడ్డ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటు చేసుకుంది. నిబంధనలు ఉల్లంఘించి పోలీసులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. కాగా.. మహిళా సబ్‌ఇన్‌స్పెక్టర్, వ్యాపారవేత్త మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఆధారంగా పోలీసులు అతనిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
నిజానికి.. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో ప్రవర్తనా నియమావళి అమలులో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు నగరంలోని ఎంట్రీ పాయింట్లు, కూడళ్లలో తనిఖీలు చేస్తున్నారు. అందులో భాగంగా.. ఝాన్సీ రోడ్ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన మహిళా ఎస్సై సోనమ్ పరాశర్ తనిఖీ చేస్తుంది. ఈ క్రమంలో.. నగరంలోని వివేకానంద కూడలిలో వాహనాల తనిఖీలు చేస్తుండగా.. ఓ లగ్జరీ కారును ఆపారు.
Also Read
- Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
ఈ క్రమంలో.. ఎస్సై సోనమ్ పరాశర్ వ్యాపారవేత్త కారుపై ఉన్న చలాన్లు కట్టాలని, హారన్ ను తొలగించాలని కోరింది. దీంతో.. వ్యాపారవేత్త ఎస్‌ఐని వేధించ సాగాడు. మహిళా ఎస్‌ఐతో అసభ్యంగా ప్రవర్తించాడు. “హారన్ ని తొలగించడం గానీ, చలాన్ కట్టడం గానీ చేయను, నా కారు నంబర్‌ను ఎస్‌పీకి చెప్పండి. కావాలంటే తను నాతో మాట్లాడండి” అన్నాడు. కాగా.. ఘటనా స్థలంలో ఉన్న పోలీసు సిబ్బంది ఈ ఘటనను వీడియో తీశారు.
మహిళా ఎస్‌ఐ సోనమ్ పరాశర్‌ను వ్యాపారవేత్త ముఖేష్ అగర్వాల్ ఎలా బెదిరించాడో మొత్తం రికార్డ్ చేశారు. అలాగే ముఖంపై వేలు పెట్టేందుకు ప్రయత్నించారు. దీంతో మహిళా ఎస్‌ఐ నిరసన వ్యక్తం చేసింది. దాదాపు 15 నిమిషాల పాటు సదరు వ్యాపారి మహిళా ఇన్‌స్పెక్టర్‌పై ఆధిపత్యం కొనసాగించాడు. ఆ తర్వాత పోలీసులను బెదిరించి ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో విషయం పోలీసు ఉన్నతాధికారులకు చేరింది. వ్యాపారిపై చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఏఎస్పీ షియాజ్ కేఎం మాట్లాడుతూ.. చట్టాన్ని ఉల్లంఘించే వారితో, పోలీసులతో ఇలాంటి దుర్మార్గంగా ప్రవర్తిస్తే సహించేది లేదన్నారు.
తాజావార్తలు
-
Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!