Fire Accident: రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలో ఫుడ్ ఫ్యాక్టరీలో మంటలు అదుపులోకి ఇంకా రాలేదు. మంటల దాటికి ఇప్పటికే ఒక ఫ్లోర్ కుప్పకూలి పోయంది. ఏ క్షణమైన బిల్డింగ్ పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు. బిల్డింగ్ పిల్లర్లు ఒక్కొక్కటి కుంగిపోతున్నాయి. ఆరు గంటలుగా మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్న సిబ్బంది. మొత్తం మూడు ఫ్లోర్లలో ఉన్న పాయల్ ఫుడ్స్ ఫ్యాక్టరీ కొనసాగుతుంది.
ఇవాళ ఉదయం హైదరాబాదులోని రాజేంద్రనగర్ లో ఓ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రాజేంద్రనగర్ పరిధిలో ఉన్న కాటేదాన్ ప్రాంతంలో బిస్కెట్ తయారీ పరిశ్రమలో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. కాటేదాన్ లో ఉన్న రవి బిస్కెట్ తయారీ పరిశ్రమలో ఉదయం ఒక్కసారిగా మంటలు చలరేగడంతో ఆ ప్రాంతంలో దట్టంగా పోగలు కమ్ముకున్నాయి. ఆ సమయంలో మంటలు క్రమంగా ఫ్యాక్టరీలోని మూడు అంతస్తులకు వ్యాపించడంతో పెద్ద ఎత్తున మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకొని రెండు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి ఇంకా అసలు కారణం తెలియ రాలేదు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Naga Chaitanya : ఆ మూవీ నాకు చాలా ప్రత్యకమైనది.. నాగచైతన్య