నేటి ఉదయం హైదరాబాదులోని రాజేంద్రనగర్ లో ఓ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ పరిధిలో ఉన్న కాటేదాన్ ప్రాంతంలో బిస్కెట్ తయారీ పరిశ్రమలో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. కాటేదాన్ లో ఉన్న రవి బిస్కెట్ తయారీ పరిశ్రమలో నేటి ఉదయం ఒక్కసారిగా మంటలు చలరేగడంతో ఆ ప్రాంతంలో దట్టంగా పోగలు కమ్ముకున్నాయి. ఆ సమయంలో మంటలు క్రమంగా ఫ్యాక్టరీలోని మూడు అంతస్తులకు వ్యాపించడంతో పెద్ద ఎత్తున మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.
Also read: Gold Price Today : షాక్ ఇస్తున్న బంగారం ధరలు.. భారీగా తగ్గిన వెండి ధరలు..
ఈ విషయాన్ని తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకొని రెండు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి ఇంకా అసలు కారణం తెలియ రాలేదు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also read: SRH vs MI: ఉత్కంఠ పోరులో తొలి విజయం సాధించిన సన్ రైజర్స్..