Drugs : డ్రగ్స్ ద్వారా వచ్చిన డబ్బును హవాలా రాకెట్‌గా మారుస్తున్న గ్యాంగ్‌ను పట్టుకుంది తెలంగాణ ఈగల్ టీమ్. ముంబై కేంద్రంగా హవాలా రాకెట్ నడుపుతున్న కింగ్‌పిన్‌ను పట్టుకున్నారు. హవాలా రూపంలో నైజీరియన్ డ్రగ్ కార్టెల్స్‌కు డ్రగ్ మనీ పంపుతున్నట్లు గుర్తించారు పోలీసులు. పెద్దమొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ ఈగల్ ఫోర్స్ మరో పెద్ద మాఫియా గుట్టురట్టు చేసింది. ముంబై కేంద్రంగా నడుస్తున్న హవాలా నెట్‌వర్క్‌ను చేధించడమే కాకుండా… హవాలా రాకెట్ నడుపుతున్న కింగ్‌పిన్‌ను పట్టుకున్నారు…
Engineering College : కాలేజీ లాకర్స్‌లో భద్రంగా దాచిన కోటి రూపాయల నగదు దోచుకెళ్లారు దొంగలు !! ఎవరికంటా కనపడకుండా లోపలికి దూరి.. లాకర్స్ బ్రేక్ చేసి మరీ దోచుకెళ్లారు !! 200 సీసీ కెమెరాలకు చెందిన డీవీఆర్‌ను కూడా ఎత్తుకెళ్లారు !! ఇదంతా వింటుంటే… ఏదో తేడాగా ఉందే ? అనిపిస్తోందా..? పోలీసులు కూడా ఇదే అనుమానిస్తున్నారు. అబ్దుల్లాపూర్‌మేట్‌లోని బ్రిల్లియంట్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో జరిగిన దోపిడీ సంచలనం రేపుతోంది. ఇది అబ్దుల్లాపూర్‌మేట్‌లోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కాలేజ్.…
Love Story : ప్రేమ వేధింపులకు మరో యువతి బలైంది. చదువుతో పాటు అన్ని రంగాలలోనూ ఫస్ట్ ప్లేస్‌లో ఉండే ఆ యువతి.. ప్రేమ వేధింపుల కారణంగా తనువు చాలించింది. రోజు రోజుకు వేధింపులు మితిమీరుతుండటంతో.. తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఇటు వేధింపులు తట్టుకోలేక మనస్థాపానికి గురై.. చివరకు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఫోటోలో ఉన్న యువతి పేరు మౌనిక. లాలాగూడలోని రైల్వే డిగ్రీ కాలేజీలో బీఏ సెకండ్ ఇయర్ చదువుతుంది. మౌనిక కుటుంబం లాలాగూడలో నివాసం ఉంటోంది.…
Crime: హిమాచల్ ప్రదేశ్ బీజేపీ చీఫ్ రాజీవ్ బిందాల్ అన్నయ్య రామ్ కుమార్ బిందాల్ ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు. డాక్టర్ అయిన రామ్ కుమార్ తనకు చికిత్స చేస్తానని చెప్పి తనపై అత్యాచారం చేసినట్లు మహిళ ఆరోపించింది. అత్యాచార బాధితురాలు మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని సోలన్ ఎస్పీ గౌరవ్ సింగ్ తెలిపారు. చికిత్స చేసినప్పటికీ తనకు ఎటువంటి ఉపశమనం లభించలేదని ఆమె అన్నారు.…
Khammam Murder Case: ఖమ్మం జిల్లా కామేపల్లి మర్డర్ కేసులో విస్తుపోయే నిజాలను వెలుగులోకి వచ్చాయి. మర్డర్ చేయడం.. ఆ తర్వాత ఆనవాళ్లను చెరిపేయడం.. డెడ్ బాడీని మాయం చేయడం లాంటి వాటిని నిందితులు యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇంతకీ ఆ కంత్రీలు ఎవరు? ఎందుకు వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని చంపారు? కేవలం బంగారం కోసమే హత్య చేశారా? READ ALSO: Bihar Elections: పార్టీలకు ఈసీ కీలక ఆదేశాలు.. ఏఐ వీడియోలు ఉపయోగించొద్దని…
Sohani Kumari: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, ప్రశాసన్ నగర్లో ఓ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. టాలీవుడ్, బాలీవుడ్ నటి అయిన సోహాని కుమారి కాబోయే భర్త సవాయ్ సింగ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌కు చెందిన సోహాని కుమారి, సవాయ్ సింగ్‌లకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారి, గత జూలైలో ఇరువురికీ నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత వారిద్దరూ జూబ్లీహిల్స్ లోని ప్రశాసన్…
ఇటీవలి కాలంలో చిన్న చిన్న విషయాలకే కొందరు పురుషులు, మహిళలు దారుణాలకు ఒడిగడుతున్నారు. భార్య కూర సరిగా వండకున్న గొడవలే.. భర్త తన వంటను మెచ్చుకోకున్నా వివాదమే.. ఇలా టీ కప్పులో తుఫానులాగా భార్యా భర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు ప్రాణాల మీదికి తెస్తున్నాయి. తాజాగా యూపీలోని తిల్హార్‌లోని ప్రహ్లాద్పూర్ గ్రామంలో ఓ గర్భిణీ స్త్రీ భర్త తనతో కలిసి అన్నం తినడానికి నిరాకరించాడని షాకింగ్ నిర్ణయం తీసుకుంది. పాయిజన్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది.…
నాగోల్‌లో ఆత్మహత్యకు పాల్పడిన మహిళకు సంబంధించిన ఘట్టం స్థానికులకు భయంకరమైన ఉదంతంగా మారింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా రెడ్యాల నుంచి వచ్చిన ఒక మహిళకు సంబంధించినది.