Araku M*urder: యువతి విషయంలో మొదలైన గొడవ.. చివరకి ప్రాణం బలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Araku Murder: అతడికి ఇదివరకే పెళ్లయింది.. పండంటి కాపురానికి గుర్తుగా భార్య గర్భవతి అయింది.. కొద్ది రోజుల్లో పాపో, బాబో పుట్టబోతున్నడు. కానీ అతనికి ఉన్న పాడు అలవాటు ప్రాణల మీదకి తెచ్చింది. ప్రత్యర్థుల చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటన అల్లూరి జిల్లా అరకులో జరిగింది.
IPL 2026: గాయాల దెబ్బకు కొత్త ప్లేయర్లు, కొత్త ఆశలు.. KKR లోకి సైనీ, GT లోకి కేజ్రోలియా..!
Also Read
- UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
- Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
- Retired GST Commissioner Kidnap Case: విశాఖలో రిటైర్డ్ జీఎస్టీ కమిషనర్ కిడ్నాప్ కలకలం..
- Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
ప్రశాంతంగా ఉండే అల్లూరి జిల్లా అరకు లోయ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. స్థానికంగా ఉన్న ఓ రిసార్టులో అత్యంత దారుణంగా మర్డర్ జరిగింది. ఓ యువతితో రిసార్ట్‌కు వచ్చిన యువకుడిని దారుణంగా హత్య చేశారు పోకిరీలు. యువతి విషయంలో మొదలైన గొడవ కాస్తా.. హత్యకు దారి తీసింది. ప్రశాంతమైన అరకులోయలో ఓ వ్యక్తి రక్తపు మడుగులో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుడిని విజయనగరం జిల్లా తెర్లాం మండలం జన్నివలస గ్రామానికి చెందిన నాగెళ్ల సురేశ్ గా గుర్తించారు. అతనికి గతేడాది వివాహం జరిగింది. అతని భార్య ప్రస్తుతం గర్భవతిగా ఉంది. గతంలో ఇదే అరకులో రిసార్టులో పని చేశాడు. కొద్దిరోజుల తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ లోని లలిత జ్యువెలరీ షాప్ లో ఉద్యోగానికి వెళ్లాడు.
సెలవు మీద హైదరాబాద్ నుంచి అరకు వచ్చిన సురేష్ తనతో పాటు ఓ యువతిని రిసార్ట్‌కు తీసుకొచ్చాడు. సదరు యువతితో అసభ్యకరంగా ప్రవర్తించారు రిసార్ట్ వద్ద కొందరు పొకిరీ యువకులు. తాను తీసుకొచ్చిన యువతితో యువకులు అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు సురేష్. దీంతో మాటామాటా పెరిగి సురేష్‌పై దాడికి దిగారు ప్రత్యర్ధులు. పిడి గుద్దులతో రెచ్చిపోయారు. హెల్మెట్ తో తలపై కొట్టారు. అనంతరం కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. దీంతో ఒక్కసారిగా రిసార్టు ప్రాంతంలో అంతా ఉద్రిక్తంగా మారింది. మర్డర్ చేసిన తర్వాత యువకులు అక్కడి నుంచి పారిపోయారు.
రిసార్ట్ వద్ద హత్య జరిగిన విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీసీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాల సాయంతో పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు సురేష్ డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు పోలీసులు. అలాగే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ మర్డర్‌పై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్‌డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!