Crime News: 11 ఏళ్ల బాలుడి గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని డ్రమ్‌లో దాచిన నిందితుడు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సత్నా జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సిద్ధార్థ్ నగర్ ప్రాంతంలో 11 ఏళ్ల బాలుడిని దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దుండగుడు బాలుడి గొంతును ఓ పదునైన ఆయుధంతో కోసి హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని ఇంట్లోనే ఉన్న బ్లూ కలర్ డ్రమ్‌లో దాచిపెట్టి బయట నుంచి తాళం వేసి పరారయ్యాడు.
మృతుడు శివరాజ్ అలియాస్ బాదల్ రజక్ (11) 5వ తరగతి చదువుతున్న విద్యార్థి. అతని తల్లి ఆశా రజక్ గృహ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. సోమవారం ఆమె, పెద్ద కుమారుడు పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపు బయట నుంచి తాళం వేసి ఉండటం అనుమానం కలిగించింది. బాలుడు కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Also Read
- Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
- Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
2 States Elections: నేటితో బెంగాల్, తమిళనాడులో ముగియనున్న ప్రచారం.. ఎల్లుండి ఓటింగ్
పోలీసులు వచ్చి తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లగా గదిలో రక్తపు మరకలు కనిపించాయి. అనుమానం రావడంతో ఇంట్లో ఉన్న నీలి డ్రమ్‌ను తెరిచి చూడగా, అందులో బాదల్ మృతదేహం రక్తపు మడుగులో కనిపించింది. అతని గొంతుపై పలు సార్లు పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఘటన వెనుక మథురా అనే వ్యక్తి ఉన్నాడని మృతుడి అక్క సెజల్ రజక్ ఆరోపించింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ఆ వ్యక్తి వారి తల్లిని బలవంతంగా వివాహం చేసుకోవాలని ఒత్తిడి తెచ్చేవాడని, కుటుంబం నిరాకరించడంతో తరచూ బెదిరింపులకు దిగేవాడని తెలిపింది. “పెళ్లి చేయకపోతే పిల్లలను చంపేస్తా” అని కూడా పలుమార్లు హెచ్చరించాడని ఆమె పేర్కొంది.
ఘటన సమయంలో బాదల్ ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని ఉపయోగించుకుని నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు నిందితుడి ఇంటికి వెళ్లగా అక్కడ కూడా తాళం వేసి ఉండటం, ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉంది. ఈ కేసుపై జిలా ఎస్పీ అధికారి శివేశ్ సింగ్ బఘేల్ మాట్లాడుతూ.. “11 ఏళ్ల బాలుడు కనిపించడంలేదని సమాచారం అందింది. ఇంటి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లగా డ్రమ్‌లో మృతదేహం లభించింది. ఇది హత్య కేసు అని ప్రాథమికంగా నిర్ధారించాం. కుటుంబ సభ్యుల వాంగ్మూలాల ఆధారంగా అనుమానితులను గుర్తించాం. నిందితుడిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక పోలీసు బృందాలు పనిచేస్తున్నాయి” అని తెలిపారు.
MI vs GT : ముంబై ఈజ్ బ్యాక్.. తిలక్ వర్మ మెరుపు శతకం.. గుజరాత్ టైటాన్స్ ఘోర పరాజయం..
ఆ తర్వాత ఘటనాస్థలానికి ఫోరెన్సిక్ బృందం, ఫింగర్ ప్రింట్ నిపుణులు చేరుకుని ఆధారాలు సేకరించారు. హత్యకు ఉపయోగించిన ఓ పదునైన కోయు ఆయుధంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది నుంచి ఈ కుటుంబం ఆ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు పిల్లల్లో బాదల్ చిన్నవాడు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
TG TET 2026 : టీచర్లకు గుడ్ న్యూస్.. ప్రత్యేక TG TET-2026-II నోటిఫికేషన్.!
-
Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
-
Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
-
Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
-
US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?