Mystery: గతవారం ఢిల్లీలోని అత్యంత విలాసమైన నోయిడా ప్రాంతంలోని ఒక కాలువలో తల లేకుండా మహిళ మృతదేహం కనిపించడం సంచలనం సృష్టించింది. అయితే, ఈ కేసును పోలీసులు ఛేదించారు. హంతకుడిని అరెస్ట చేశారు. నిందితుడిని సదరు మహిళ ప్రియుడిగా గుర్తించారు. బస్సు డ్రైవర్ అయిన మోను సోలంకి అరెస్ట్ తర్వాత కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివాహితుడైన సోలంకి మహిళలో లవ్ ఎఫైర్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమె బ్లాక్మెయిల్ చేయడంతో తాను నేరానికి పాల్పడినట్లు చెప్పాడు.
ఒక యువకుడు మొబైల్ ఫోన్ దొంగిలించాడని ఆరోపిస్తూ, కొంతమంది యువకులు అతని కాళ్ళను తాడుతో కట్టి చెట్టుకు తలక్రిందులుగా వేలాడదీశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. ఈ సంఘటన ఘుగ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘఘ్రౌవా ఖదేసర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు ఐదుగురు నిందితులపై కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. Also Read:Komatireddy Venkat Reddy : ఫాం హౌస్ నుండే వస్తలేడు.. అధికారంలోకి ఎలా వస్తాడు ఘగ్రౌవాలోని…
Vikarabad: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు మూడు ప్రాణాలను బలి తీసుకున్నాయి. మండల కేంద్రంలో నివసిస్తున్న యాదయ్య అనే వ్యక్తి తన భార్య, కూతురు, వదినను కిరాతకంగా హత్య చేసి, చివరికి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.
Hyderabad: హైదరాబాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. రాజేంద్రనగర్‌లో ఇండిగో ఎయిర్‌లైన్స్ క్యాబిన్ క్రూగా పనిచేస్తున్న యువతి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలిని జాహ్నవి గుప్తాగా పోలీసులు గుర్తించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. జాహ్నవి ఇండిగో కెప్టెన్, మరో ఫ్రెండ్‌తో కలిసి పార్టీ చేసుకుంది. అనంతరం తన గదికి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న సహచరులు, స్నేహితులు షాక్‌కు గురయ్యారు.
Karimnagar: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులను అసభ్యకరంగా తాకుతూ, బాత్రూముల్లో కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తూ ఏడాదిగా వేధింపులకు గురి చేస్తున్న కీచక అటెండర్ యాకుబ్ పాషా బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ‘‘కురిక్యాల’’లో చోటు చేసుకుంది. ఈ అంశంపై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. సఖి కౌన్సిలింగ్ నిర్వాహకుల ద్వారా యాకుబ్ పాషా దారుణాలను కలెక్టర్ తెలుసుకున్నారు.
క్రీడా ప్రపంచంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ అంతర్జాతీయ జుజిట్సు క్రీడాకారిణి రోహిణి కలాం ఆత్మహత్య చేసుకుంది. 2022 ఆసియా క్రీడల్లో భారతదేశానికి రోహిణి కలాం ప్రాతినిధ్యం వహించింది. మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో తన ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.
Hit And Run Case: హైదరాబాద్ మహా నగరంలోని నార్సింగి పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదర్ షాకోట్ చౌరస్తా దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్తే, హైదర్ షాకోట్ ప్రాంతానికి చెందిన కృష్ణ అనే వ్యక్తిని గుర్తు తెలియని కారు ఢీకొట్టింది.
Crime: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో షాకింగ్ సంఘటన జరిగింది. తన స్నేహితుడు, తన తల్లితో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతో ఒక యువకుడు హత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నగరంలో సంచలనంగా మారింది. శనివారం ఉదయం శ్యామ్‌నర్ మల్టీలో మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది.
PM Modi Kurnool Tour: ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు పర్యటనలో భద్రత లోపం వెలుగు చూసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుండిపెంట హెలిపాడ్‌లో ప్రధానికి వీడ్కోలు సమయంలో పాస్‌ల జాబితాలో లేని వ్యక్తుల ప్రవేశం కలకలం సృష్టించింది. ఇతరుల పేరుతో ఉన్న పాసులతో ప్రధాని వలయంలోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారు.