ఉత్తరాఖండ్‌లోని ఉధమ్ సింగ్ నగర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడిపై దాడి జరిగింది. దాడిలో తీవ్రంగా గాయపడిన ఎమ్మెల్యే కుమారుడిని చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతన్ని ఐసియులో చేర్చారు. నివేదికల ప్రకారం, కిచ్చా కాంగ్రెస్ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ క్యాబినెట్ మంత్రి తిలక్‌రాజ్ బెహాద్ కుమారుడు, రుద్రపూర్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డు కౌన్సిలర్ సౌరభ్ బెహాద్ పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఎమ్మెల్యే కుమారుడు, కౌన్సిలర్ సౌరభ్ బెహాద్ను…
Madhya Pradesh: ఎవరైనా బంగారం, డబ్బు లేదా ఇంట్లోని ఇతర విలువైన వస్తువులు దొంగిలిస్తారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ దొంగతనం మాత్రం విచిత్రంగా ఉంది. విదిష జిల్లాలో ట్రాఫిక్ వేగాన్ని నియంత్రించడానికి రోడ్లపై ఏర్పాటు చేసిన ‘‘స్పీడ్ బ్రేకర్’’లను దొంగిలించారు. ఇటీవల, విదిష మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు రూ. 8 లక్షల ఖర్చుతో ఈ స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేసింది.
Police Academy: కేరళలో అత్యంత కట్టుదిట్టం భద్రత కలిగిన త్రిస్సూర్ జిల్లాలోని కేరళ పోలీస్ అకాడమీ క్యాంపస్ నుంచి లక్షల విలువ కలిగిన గంధపు చెట్లు దొంగలు దొంగిలించారు. పోలీస్ అకాడమీలోని చెట్లను ఎత్తుకెళ్లిపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. 30 ఏళ్ల కన్నా పాతవైన గంధపు చెట్ల దొంగతనం జరిగిన కొన్ని రోజులకు తెలిసింది.
S*exually Assault: తిరుపతి జిల్లా తిరుచానూరులో చిన్నారిపై లైంగిక దాడి తీవ్ర కలకలం రేపింది. ఏడేళ్ల గిరిజన బాలికపై ఓ వ్యక్తి చాక్లెట్ ఆశ చూపి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని గురి చేసింది.
గురువారం జమ్మూ కాశ్మీర్ ఛాంపియన్స్ లీగ్ మ్యాచ్ సందర్భంగా పెద్ద వివాదం చెలరేగింది. స్థానిక క్రికెటర్ ఫుర్కాన్ భట్ తన హెల్మెట్ పై పాలస్తీనా జెండా ధరించి కనిపించాడు. ఈ సంఘటన వివాదానికి దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ కోసం పిలిపించారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జమ్మూలో జరిగిన ఒక ప్రైవేట్ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా ఒక ఆటగాడి హెల్మెట్‌పై పాలస్తీనా జెండాను ప్రదర్శించినందుకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ పోలీసులు క్రికెటర్,…
బెంగళూరులోని బసవేశ్వరనగర్ ప్రాంతంలో షాకింగ్ సంఘటన వెలుగుచూసింది. 28 ఏళ్ల అద్దెదారుడు ఆగ్రహానికి గురై 45 ఏళ్ల మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ మహిళ తన కుమార్తెతో యువకుడి వివాహ ప్రతిపాదనను నిరాకరించడమే దీనికి కారణం. ఆ మహిళ పేరు గీత. ఆమె ఒక కిరాణా దుకాణం నడుపుతోంది. ప్రస్తుతం ఆమె విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. నిందితుడు టీ దుకాణం నడుపుతూ ఉండేవాడు. Also Read:Unbreakable…
Hitech Thief: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైటెక్ దొంగ బత్తుల ప్రభాకర్ ఉదంతం మరో మలుపు తిరిగింది. రాజమండ్రి సమీపంలో పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయిన ప్రభాకర్ ఆచూకీని ఎట్టకేలకు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతను చెన్నై సమీపంలో ఉన్నట్లు సాంకేతిక ఆధారాల ద్వారా పోలీసులు నిర్ధారించుకున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ ‘ప్రిజం’ పబ్బులో కాల్పులు జరిపి హల్చల్ సృష్టించడంతో ప్రభాకర్ పేరు మొదటిసారి వెలుగులోకి వచ్చింది. అప్పటి నుండి అతను పోలీసులకు సవాల్‌గా మారుతూనే ఉన్నాడు.…
Tragedy: ఉత్తర్ ప్రదేశ్ వారణాసిలో విషాదకర సంఘటన వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వ్యక్తి భార్య చేసిన మోసానికి బలైపోయాడు. తన బిడ్డను తన నుంచి దూరం చేయడమే కాకుండా, తన భార్యకు తన ప్రియుడితో ఉన్న సంబంధం గురించి ఆరోపిస్తూ తన బాధను 7 నిమిషాల వీడియలో రికార్డ్ చేశాడు. బైక్ నడుపుతున్నప్పుడు చిత్రీకరించిన ఈ వీడియోలో తాను చనిపోవాలని అనుకోవడం లేదని, కానీ తనకు వేరే మార్గం లేదని పదే పదే చెప్పాడు. ఇప్పుడు…
Minister Anita: తిరుపతి సంస్కృత యూనివర్సిటీలో జరిగిన లైంగిక దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్న నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఈ కేసు పురోగతిపై పూర్తి సమాచారం తెలుసుకునేందుకు ఆమె తిరుపతి ఎస్పీతో పాటు పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని ఆరా తీశారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు చర్యలు ప్రారంభించినట్లు హోంమంత్రి వెల్లడించారు. తిరుపతి ఎస్పీ స్వయంగా కేసును పర్సనల్‌గా పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. ప్రాథమిక దర్యాప్తు భాగంగా సాక్ష్యాలు, సంబంధిత సమాచారం…
Bomb Blast : కొత్తగూడెం రైల్వే స్టేషన్లో బుధవారం ఉదయం బాంబు కలకలం సృష్టించింది. మొదటి ప్లాట్‌ఫామ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఉంచిన నల్లటి సంచిలో ఉన్న నాటు బాంబు పేలడంతో ఒక వీధి కుక్క అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఉదయం వేళ రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్‌ఫామ్ పక్కన రైల్వే ట్రాక్‌పై ఉంచిన నల్లటి సంచిని ఒక వీధి కుక్క ఆహారంగా భావించి తినే…