Tragedy : నమ్మి వెళ్తే నరికేశారు.. పరకాల హత్య కేసులో విస్తుపోయే నిజాలు.!
- వివాహేతర సంబంధమే హత్యకు కారణం
- భర్తపై రూ.5 లక్షల సుపారీ
- బీరు సీసాలతో దారుణ హత్య
- నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పరకాల పట్టణంలోని సీఎస్ఐ కాలనీకి చెందిన మడికొండ సుమన్ (మెకానిక్), లావణ్య (మున్సిపల్ కార్మికురాలు) దంపతులకు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. సుఖంగా సాగిపోతున్న వీరి సంసారంలోకి వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. లావణ్యకు స్థానికంగా ఉండే ఒక వ్యక్తితో ఏర్పడిన పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్త సుమన్‌కు తెలియడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ప్రియుడితో కలిసి ఉండటానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన లావణ్య, అతడిని ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం గోవిందరావుపేటకు చెందిన ఒక వ్యక్తితో రూ. 5 లక్షల సుపారీ ఒప్పందం కుదుర్చుకుంది.
Lenskart: బొట్టు-తిలకంపై నిషేధం, హిజాబ్‌కు అనుమతి.. టీసీఎస్ రచ్చ మధ్య లెన్స్‌కార్ట్ డ్రెస్‌కోడ్..
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
గతంలో రెండుసార్లు సుమన్‌ను చంపేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కాగా, ఈసారి పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగింది. ఈ నెల 3వ తేదీన దంపతులిద్దరూ వరంగల్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు (ఏప్రిల్ 4) నుంచి సుమన్ కనిపించకుండా పోయాడు. లావణ్య తనకు ఏమీ తెలియనట్లు నటిస్తూ సుమన్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. బాధితుడి తండ్రి సాంబయ్య ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పరకాల పోలీసులు, సుమన్ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ములుగు జిల్లా గోవిందరావుపేట శివారులో సిగ్నల్ కట్ అయినట్లు గుర్తించి అక్కడ గాలించగా, గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న సుమన్ మృతదేహం లభ్యమైంది.
Delimitation Bill: మీ టికెట్లు అన్నీ ముస్లిం మహిళలకు ఇవ్వండి.. అఖిలేష్‌కు అమిత్ షా కౌంటర్..
సుమన్‌ను వరంగల్ నుండి గోవిందరావుపేట శివారుకు తీసుకెళ్లిన నిందితులు, అక్కడ అతడికి మద్యం తాగించి బీరు సీసాలతో పొడిచి హత్య చేశారు. ఆ తర్వాత సాక్ష్యాలు దొరకకుండా ఉండేందుకు శవంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. పోలీసుల విచారణలో లావణ్య తన నేరాన్ని అంగీకరించడంతో, ఆమెతో పాటు సుపారీ తీసుకున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?