Kukatpally Suicide: కూకట్‌పల్లి ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. వెలుగులోకి కీలక విషయాలు..
- కుటుంబ విషాదానికి అసలు కారణం ఏంటి?
- రెండో పెళ్లితో మొదలైన వివాదం
- ఆస్తి కోణంలో కొత్త అనుమానాలు
- భర్తపై బంధువుల తీవ్ర ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కూకట్‌పల్లి పరిధిలోని కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో మంగళవారం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విగతజీవులుగా పడి ఉండటం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. స్రవంతి అనే మహిళ తన ఇద్దరు కుమారులను (12 ఏళ్లు , 10 ఏళ్లు) చంపి, ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. అయితే, ఇది ఆత్మహత్య కాదని, భర్త ప్రవీణ్ చేసిన పథకం ప్రకారమే ఈ దారుణం జరిగిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.
స్రవంతికి, ప్రవీణ్‌కు 18 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, ప్రవీణ్ తన మేనత్త కూతురిని రెండో పెళ్లి చేసుకోవడంతో దంపతుల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. మొదటి భార్యకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో ప్రవీణ్ తల్లిదండ్రులు (స్రవంతి అత్తమామలు) కొంత స్థలాన్ని ఆమె పేరు మీద రాసిచ్చారు.
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
కొంతకాలం తర్వాత ప్రవీణ్‌ను రెండో భార్య కూడా వదిలి వెళ్లడంతో, అతను తిరిగి స్రవంతికి దగ్గరయ్యాడు. అయితే, ఆమె పేరు మీద ఉన్న ఆస్తిని తిరిగి తన పేరు మీదకు మార్చాలని ప్రవీణ్ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఈ విషయంలో నిన్న రాత్రి కూడా పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగిందని, ఆ తర్వాతే ఈ ఘోరం జరిగిందని తెలుస్తోంది.
మృతదేహాలను చూసిన బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన వారి శరీర రంగు మారిపోయిందని, ప్రవీణే రాత్రిపూట ముగ్గురిని చంపి, ఉదయం ఏమీ ఎరుగనట్లు పనికి వెళ్లి, మధ్యాహ్నం వచ్చి డ్రామా ఆడుతున్నాడని వారు ఆరోపిస్తున్నారు.
సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు క్లూస్ టీంతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రవీణ్ వేధింపుల భరించలేక స్రవంతి ఈ నిర్ణయం తీసుకుందా లేక దీని వెనుక ప్రవీణ్ హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
తాజావార్తలు
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!