Naga Vamsi : ‘విశ్వనాథ్ & సన్స్’తో సంజయ్ రామస్వామి మ్యాజిక్ రిపీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ వేడుకలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ కాన్ఫిడెంట్ వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా పూజా కార్యక్రమాల సమయంలోనే సంజయ్ రామస్వామి లాంటి పాత్రను మళ్లీ తీసుకురాబోతున్నామని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టానని, ఆ మాటపై ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. సూర్య ఎన్ని సినిమాలు చేసినా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ‘గజినీ’, ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంటుందని, వాటి సరసన ‘విశ్వనాథ్ & సన్స్’ కచ్చితంగా చేరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తల్లికొడుకుల మధ్య ఉండే అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అమ్మను ప్రేమించే ప్రతి ఒక్కరికీ పిచ్చిపిచ్చిగా నచ్చేస్తుందని, థియేటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని చెప్పారు. ముఖ్యంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ఈ సినిమా బాగా నచ్చిందని, ఆయనకు నచ్చిన సినిమా తమ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఇప్పటివరకు ఫెయిల్ కాలేదని గుర్తుచేశారు. ‘అత్తారింటికి దారేది’లో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఎంత కిక్ ఇచ్చిందో, ఈ సినిమాలో సూర్య పాత్ర కూడా ప్రేక్షకులకు అంతటి కిక్ ఇస్తుందని నాగవంశీ ధీమా వ్యక్తం చేశారు.
Also Read
తాజావార్తలు
-
Kavya -Anirudh Reception: కావ్య-అనిరుధ్ గ్రాండ్ రిసెప్షన్.. సీఎం విజయ్ స్పెషల్ గిఫ్ట్.. రజనీ, కమల్ ఆప్యాయపు నవ్వులు..
-
IND vs NZ Test: టీమిండియా బ్యాటర్ల ఊచకోత.. భారీ ఆధిక్యంలో భారత్..!
-
Tragedy: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
-
India Test Record : న్యూజిలాండ్ గడ్డపై భారత్ అరుదైన రికార్డు.. ఇదే తొలిసారి!
-
Asaduddin Owaisi: సుప్రీంకోర్టు జడ్జి అనుకుని ఒవైసీకి గౌరవ వందనం.. వివాదంలో యూపీ పోలీసులు.!
ట్రెండింగ్
-
Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!