Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Porel Arrested in Rape Case: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న బెంగాల్ క్రికెటర్ అభిషేక్ పోరెల్ అరెస్ట్ అయ్యాడు. ఓ మెడికల్ విద్యార్థిని ఫిర్యాదు మేరకు నమోదైన క్రిమినల్ కేసులో అతడు అరెస్టు అయ్యాడు. డమ్ డమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎమామి సిటీలో పోలీసులు అభిషేక్‌ను అరెస్టు చేసినట్లు హుగ్లీ రూరల్ పోలీస్ ఎస్పీ కున్వర్ భూషణ్ సింగ్ తెలిపారు. గత జూన్‌లో ఓ వైద్య విద్యార్థిని అభిషేక్‌పై కేసు నమోదు చేసింది. అత్యాచారం, క్రిమినల్ బెదిరింపులు, దాడి తదితర తీవ్రమైన ఆరోపణలు అతడిపై ఉన్నాయి.
అభిషేక్ పోరెల్ పెళ్లి చేసుకుంటానని చెప్పి తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని, అనంతరం తనపై దాడి చేసి బెదిరింపులకు పాల్పడ్డాడని మెడికల్ విద్యార్థిని తన ఫిర్యాదులో ఆరోపించింది. తనకు, పోరెల్‌కు సుమారు మూడేళ్లుగా సంబంధం ఉన్నట్లు పేర్కొంది. గత ఏడాది నుంచి ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయని, ఆ తర్వాత పోరెల్ తనకు దూరంగా ఉంటున్నాడని ఆమె ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని హామీ తనపై దాడి, బెదిరింపులకు దిగాడని చెప్పుకొచ్చింది. ఈ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం కేసులో పోరెల్‌ను అరెస్ట్ చేయాలని కోల్‌కతా హైకోర్టు పోలీసులను ఆదేశించింది. తనపై వచ్చిన ఆరోపణలను అభిషేక్ గతంలో ఖండించాడు. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉంది. కోర్టు విచారణ, దర్యాప్తు ద్వారా అసలు వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.
Also Read
అభిషేక్ పోరెల్ లెఫ్ట్ హ్యాండ్ టాప్ ఆర్డర్ బ్యాటర్. 2023 నుంచి ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గత సీజన్లో ఢిల్లీ తరఫున నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 108 పరుగులు చేశాడు. అంతకుముందు భారత్-ఏ జట్టుతో కలిసి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనలకు కూడా వెళ్లాడు. బెంగాల్ తరఫున 2021-22 సీజన్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన పోరెల్.. ఇప్పటివరకు 32 ఫస్ట్ క్లాస్, 23 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. క్రికెట్లో ఎదుగుతున్న సమయంలో అతడిపై నమోదైన ఈ కేసు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Amaravati – Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
-
O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
ట్రెండింగ్
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!