YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YouTube Monetization Rules 2027: యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ డబ్బు సంపాదించాలనుకునే కొత్త క్రియేటర్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్లాట్‌ఫారమ్‌లో క్రియేటర్ల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో, యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ (YPP) మోనిటైజేషన్ నిబంధనలను కంపెనీ మరింత కఠినతరం చేసింది. ఇకపై యూట్యూబ్ నుంచి ఆదాయం పొందే అర్హత సాధించాలంటే క్రియేటర్లు మునుపటి కంటే రెండింతల పెద్ద ఆడియన్స్‌ను సంపాదించుకోవాల్సి ఉంటుంది. నూతన నిబంధనల ప్రకారం.. క్రియేటర్లు తమ ఛానెల్లో మోనిటైజేషన్ పొందేందుకు గడిచిన ఏడాది (12 నెలలు) వ్యవధిలో కనీసం 8,000 గంటల వాచ్ టైమ్‌ను సాధించాలి, లేదా గడిచిన 90 రోజుల్లో కనీసం 20 మిలియన్ల (2 కోట్లు) షార్ట్స్ వ్యూస్‌ను సాధించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం 1,000 సబ్స్క్రైబర్లు ఉండటంతో పాటు ఏడాదిలో 4,000 గంటల వాచ్ టైమ్ లేదా 90 రోజుల్లో 10 మిలియన్ల షార్ట్స్ వ్యూస్ ఉంటే మోనిటైజేషన్‌కు అర్హత లభించేది. ఇక ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, ఇప్పటికే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్‌లో భాగమై ఆదాయం పొందుతున్న పాత క్రియేటర్లకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు లభించింది. వారిపై ఎలాంటి ప్రభావం ఉండదు.
అంతేకాకుండా, షార్ట్స్ క్రియేటర్ పూల్ ద్వారా నిరంతరం ఆదాయం పొందాలంటే క్రియేటర్లు 90 రోజుల వ్యవధిలో 10 మిలియన్ల షార్ట్స్ వ్యూస్‌ను నిలకడగా కొనసాగించాల్సి ఉంటుందని యూట్యూబ్ స్పష్టం చేసింది. ఒకవేళ ఏ సమయంలోనైనా వ్యూస్ పరిమితి కంటే తగ్గితే.. వారి షార్ట్స్ ఆదాయం మాత్రమే ఆగుతుంది. కానీ వారు పార్ట్నర్ ప్రోగ్రామ్‌లోనే కొనసాగుతూ లాంగ్ ఫార్మాట్ వీడియోల ద్వారా వచ్చే ఆదాయాన్ని పొందుతారు. మళ్లీ షార్ట్స్ వ్యూస్ 10 మిలియన్లు దాటిన వెంటనే షార్ట్స్ ద్వారా వచ్చే ఆదాయం పునరుద్ధరించబడుతుంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో రోజుకు 200 బిలియన్లకు పైగా షార్ట్స్ వ్యూస్ వస్తున్నాయని, అలాగే టీవీల్లో రోజూ బిలియన్ గంటలకు పైగా వాచ్ టైమ్ నమోదు అవుతోందని.. ఈ వేగవంతమైన ఎదుగుదలకు అనుగుణంగానే నిబంధనలు మార్చినట్లు యూట్యూబ్ వెల్లడించింది. దీనివల్ల కొత్తగా వచ్చే క్రియేటర్లకు మోనిటైజేషన్ సాధించడం అత్యంత కష్టతరం కానుంది. ఇదే సమయంలో, యూట్యూబ్ తన వినియోగదారులకు తక్కువ ధరలో లభించే ‘ప్రీమియం లైట్’ (Premium Lite) సబ్‌స్క్రిప్షన్‌ను యూట్యూబ్ ప్రీమియం అందుబాటులో ఉన్న అన్ని దేశాలకు విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సబ్స్క్రిప్షన్ ద్వారా వచ్చే ఆదాయంలో క్రియేటర్లకు కూడా వాటా లభిస్తుంది. వాచ్ టైమ్, వ్యూస్ ఆధారంగా లాంగ్ ఫార్మాట్ వీడియో క్రియేటర్లకు 55 శాతం, షార్ట్స్ క్రియేటర్లకు 45 శాతం ఆదాయాన్ని యూట్యూబ్ పంచనుంది.
Also Read
తాజావార్తలు
-
Police Recruitment: పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు.. ఎస్సై, కానిస్టేబుల్ జీతాల వివరాలు వెల్లడి..
-
Shivaji: “ఆ బూతులు అవసరమా అనిపించింది.. ట్రైలర్ చూసి నేనే షాక్ అయ్యా”.. ‘ఎపిక్’ ఈవెంట్లో శివాజీ బోల్డ్ కామెంట్స్!
-
Liquor Tenders: ఏపీలో మద్యం టెండర్లు.. ఎంఆర్పీ ధరలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
-
Naga Vamsi : ట్రైలర్లో ఆనంద్ ముద్దు సీన్.. ’90స్’ డైరెక్టర్‌పై ట్రోల్స్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నాగవంశీ!
-
Airlines: కీలక పండుగల వేళ ఛార్జీలకు రెక్కలు.. భారీగా పెంచేసిన విమాన సంస్థలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!