Saida Begum: విజయవాడ టెర్రర్ లింక్ లో హైదరాబాదీ సైదా బేగం.. విచారణ లో సంచలన విషయాలు వెలుగులోకి
- విజయవాడ టెర్రర్ లింక్ లో హైదరాబాదీ సైదా బేగం
- మహిళలను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా సైదా బేగం బాధ్యత
- మహిళలను రిక్రూట్ చేసుకునేలా సైదా బేగం కు ఉగ్రవాదుల టార్గెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ టెర్రర్ లింక్ లో హైదరాబాదీ సైదా బేగం విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళలను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా సైదా బేగం బాధ్యత తీసుకున్నట్లు గుర్తించారు. మహిళలను రిక్రూట్ చేసుకునేలా సైదా బేగం కు ఉగ్రవాదుల టార్గెట్ ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది. ఇప్పటి వరకు 42 మంది అమ్మాయిలను సైదా రిక్రూట్ చేసినట్టు అధికారులు గుర్తించారు.
అమ్మాయిలకు స్నిప్పర్ రైఫిల్, షూటింగ్ వంటి వాటిలో ట్రైన్ చేయాలని టెర్రరిస్టులు అదేశాలు ఇచ్చినట్లు తేలింది.
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
Khawateen పేరుతో స్పెషల్ వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేసిన సైదా బేగం.. మరింత ఎక్కువగా యూత్ ను ఇస్లాం వైపు ఆకర్షితులను చేసి నెట్వర్క్ పెంచాలని జిహాదీ గ్రూప్స్ నుండి ఆదేశాలు వచ్చినట్లు నిర్ధారణ అయినట్లు తెలిపారు. ఇందులో ఒసామా బిన్ లాడెన్, జకీర్ నాయక్ వీడియోలు షేర్ చేస్తూ అమ్మాయిలను ఉగ్రవాదం వైపు మల్లించింది సైదా బేగం. ఇన్ స్టాగ్రామ్ లో 40 అకౌంట్ లు తెరిచి జిహాదీ వీడియోలు పోస్ట్ చేస్తూ యూత్ లో ఐడియాలజీ నింపింది.
Also Read:Repo Rate: రెపో రేట్ పై ఆర్‌బీఐ గవర్నర్ కీలక ప్రకటన.. ఈఎంఐ తగ్గుతుందా?
మదర్సాల్లో మతపరమైన శిక్షణ అయ్యాక వెపన్ ట్రైనింగ్ కు సన్నాహాలు చేసినట్లు వెల్లడైంది. వాట్సాప్, insta అకౌంట్ ల్లో కుప్పల కొద్ది pdf ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బ్లాక్ పౌడర్ మేకింగ్, పేలుడు పదార్థాల తయారీ వంటి వీడియోలు ఉన్నట్టు గుర్తించారు. వీటిని ట్రైనింగ్, రిక్రూట్‌మెంట్‌కు సంబంధించినవిగా గుర్తించారు. ప్రస్తుతం ఉగ్రవాద లింకులపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తద్వారా ఉగ్రవాద నెట్‌వర్క్‌లో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!