Double Murder : గండవరం పొలాల్లో రక్తపాతం.. జంట హత్యల వెనుక అసలు కథ ఇదే!
- గండవరం పొలాల్లో ఇద్దరు యువకుల దారుణ హత్య
- పెద్దపుతేడుకు చెందిన కుందుర్తి వెంకటేష్
- వెంగారెడ్డిపాలానికి చెందిన బాల వెంకయ్యగా గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రశాంతంగా ఉండే ఆ గ్రామంలో ఒక్కసారిగా చావు కేకలు వినిపించాయి. ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. వ్యవసాయ పనుల కోసం డీజిల్ పట్టుకుని వెళ్తున్న ఆ ఇద్దరిని వివాహేతర సంబంధం చంపేసిందా…? పోలీసుల విచారణలో ఏం తేలింది..? నిందితులు ఎవరు..? నెల్లూరు జిల్లాలో జరిగిన జంట మర్డర్స్ ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. నెల్లూరు జిల్లా గండవరం పొలాల్లో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. పదునైన రాడ్‌లతో వారిని గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. దీంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొడవలూరు మండలం పెద్దపుతేడుకు చెందిన కుందుర్తి వెంకటేష్, సంఘం మండలం వెంగారెడ్డిపాలానికి చెందిన బాల వెంకయ్యలు సమీప బంధువులు. గడ్డి మిషన్ కోసం డీజిల్ తీసుకెళ్తుండగా పక్కా స్కెచ్ వేసి.. గండవరం పొలాల దగ్గర నుంచి వడ్డీ పాలెం మెయిన్ రోడ్డుపై వెళుతున్న వారిద్దరని హత మార్చారు. తల మీద బలమైన గాయాలతో చెట్లలో పడిపోయిన వారిని గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు….
ముందు రోజు సాయంత్రం నుంచి ఇంటికి రాని ఇద్దరి కోసం కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ లభించలేదు. మృతదేహాలను గుర్తించిన పోలీసులు… కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు తమ వారిని గుర్తుపట్టి.. కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే వెంకటేష్‌కు అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉండేదని.. మహిళ బంధువు ఇటీవల కాలంలో వెంకటేష్‌ను బెదిరించారని.. అతని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ ఆధారంగా.. పోలీసులు వేలిముద్రలు సేకరించారు…
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
జంట హత్యలకు వివాహేతర సంబంధమే కారణమా? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెంకటేష్ టార్గెట్‌గా నిందితులు విచక్షణారహితంగా దాడి చేసినట్లు.. అడ్డొచ్చిన బాల వెంకయ్యను కూడా హత మార్చినట్లు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. పక్కా స్కెచ్.. పక్కా ప్లాన్ వేసి.. మృతుల కదలికలను ముందే గమనించిన నిందితులు… నిర్మానుష్య ప్రాంతానికి రాగానే చంపేసినట్లు సీన్‌ను బట్టి అర్థం అవుతుంది. జంట హత్యలతో ఒక్కసారిగా గండవరం గ్రామం ఉలిక్కిపడింది….
ఐతే మృతుడు వెంకటేష్‌కు.. పెద్ద పుతేడ్ గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఇటీవల రెండు రోజుల క్రితం వెంకటేష్‌కు మహిళ బంధువులకు గొడవ జరిగింది. ఈ నేపథ్యంలోని ముగ్గురు యువకులు వారిద్దరిని దారుణంగా హతమార్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. నిందితులు బత్తల కళ్యాణ్‍తో పాటు ప్రశాంత్ విజయ్ భాస్కర్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు..
తాజావార్తలు
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!