Vijayawada: టెర్రర్ లింకుల కేసులో ఇద్దరు అరెస్ట్.. వెలుగులోకి కొత్త నిజాలు.!
- విజయవాడ టెర్రర్ లింకుల కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్
- అబ్దుల్ సలాం (A11), సైదా బేగం (A5) అరెస్ట్
- కోర్టు ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధింపు
- ఇప్పటికే మరో ముగ్గురు నిందితులు జైలుకు పంపింపు
- కేసు దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada: విజయవాడలో టెర్రర్ లింకుల కేసు దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో కీలక మలుపు తిరిగింది. పోలీసులు తాజాగా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా, న్యాయస్థానం వారికి ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో A11 అబ్దుల్ సలాం, A5 సైదా బేగంను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్‌కు తరలించారు. ఇప్పటికే ఈ కేసులో మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే.
Actor Rajasekhar: డాన్స్ రాదని ఒప్పుకున్న రాజశేఖర్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!
Also Read
- Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
- Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్రెడ్డి ప్రశ్న
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు విచారణను మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. నిందితుల బ్యాంక్ ఖాతాల లావాదేవీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దీనికోసం సంబంధిత బ్యాంకులను సంప్రదించి, పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు. అలాగే నిందితులు ఉపయోగించిన మూడు మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. ఫోన్లలో ఉన్న కాల్ డేటా, మెసేజింగ్ వివరాలను విశ్లేషిస్తూ, మరిన్ని లింకులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. నిందితులు పట్టుబడిన ఇంట్లో ఉగ్రవాద భావజాలాన్ని ప్రోత్సహించే పుస్తకాలు, లిటరేచర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న సైదా బేగం గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ సైదాబాద్ కు చెందిన ఆమె, ఏడాది క్రితం విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నట్లు సమాచారం. పోలీసుల విచారణలో సైదా బేగం 42 మందితో ఒక టెర్రర్ గ్రూప్ ఏర్పాటు చేసి, సోషల్ మీడియాలో ఉగ్రవాదానికి సంబంధించిన పోస్టింగ్లు చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఈ కార్యకలాపాలు ఎక్కువగా సాగినట్లు గుర్తించారు. సైదా బేగం విదేశీ హ్యాండ్లర్లతో సంబంధాలు కొనసాగిస్తూ, వారి సూచనల మేరకు టెర్రర్ కంటెంట్ ప్రచారం చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేసి, దాని ద్వారా యువతను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది.
YS Jagan: జగన్ 2.0లో మహిళలకు, కార్యకర్తలకు పెద్దపీట.. నేతలతో జగన్ భేటీ..!
అంతేకాదు, యువతను రాడికలైజ్ చేసి ఉగ్రవాద దిశగా మళ్లించే ప్రయత్నాలు జరిగినట్లు విచారణలో తేలింది. సోషల్ మీడియా వేదికగా ఈ ప్రభావం పెరుగుతుండటంపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో నిందితులను మరింతగా విచారించేందుకు పోలీసులు కోర్టులో వారం రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
తాజావార్తలు
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
-
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్రెడ్డి ప్రశ్న
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!