నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ రాక చాలా ఉల్లాసంగా సాగినట్లుగా కనిపిస్తోంది. వాతావరణం పూర్తిగా ఆమెకు అనుకూలంగా మారింది. ఇక ఆమె రాకను ప్రజలే కాదు.. ప్రకృతి కూడా పులకించింది. సునీతా విలియమ్స్‌ను తీసుకొచ్చిన క్యాప్సూల్.. సముద్రంపై ల్యాండ్ కాగానే ఆమె చుట్టూ డాల్ఫిన్ల గుంపు తిరుగుతూ కనిపించాయి. మత్స్య సంపద ఆమెకు ఘనస్వాగతం పలికాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ఆ ఇద్దరిపై రెడ్ కార్నర్ నోటీసులు
ఇక సునీతా విలియమ్స్ దాదాపు 9 తొమ్మిది నెలల తర్వాత భూమ్మీద అడుగుపెట్టింది. క్యాప్సూల్ నుంచి బయటకు వస్తూ సునీతా విలియమ్స్ చిరునవ్వులు చిందించారు. అందరికీ హాయ్ చెబుతూ.. చాలా ఉల్లాసంగా కనిపించారు. ఆమెలో ఎలాంటి ఆందోళన కనిపించలేదు. చాలా ఉత్సాహంగా.. ఆనందంగా ఉన్నట్లు వీడియోను బట్టి తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: AP Assembly 2025: 14వ రోజు అసెంబ్లీ సమావేశాలు.. ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం!
గతేడాది జూన్ 5న సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళ్లారు. వారంలోనే తిరిగి రావాల్సి ఉండగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దాదాపు తొమ్మిది నెలల పాటు ఉండి పోవల్సి వచ్చింది. మొత్తానికి ఇన్నాళ్లకు క్షేమంగా సునీతా విలియమ్స్ భూమ్మీదకు చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు ప్రజలంతా స్వాగతం పలుకుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతేకాకుండా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
There are a bunch of dolphins swimming around SpaceX's Dragon capsule. They want to say hi to the Astronauts too! lol pic.twitter.com/sE9bVhgIi1
— Sawyer Merritt (@SawyerMerritt) March 18, 2025