ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇక ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి బీజేపీ అగ్ర నేతలంతా చేరుకున్నారు.
ప్రధాని మోడీ మరో విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో ఫ్రాన్స్‌లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఫిబ్రవరి 11న పారిస్‌లో జరిగే ఏఐ సమ్మిట్‌కు మోడీ అధ్యక్షత వహించనున్నారు.
Nagarjuna : టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పార్లమెంట్ హౌస్‌లో కలిశారు. ఈ సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావు (ANR) 100వ జయంతిని పురస్కరించుకుని "మహాన్ అభినేత అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ" అనే గ్రంథాన్ని ప్రధాని మోదీకి అందించారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని మారోసారి టార్గెట్ చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పినదంతా.. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించేదని అన్నారు.. బీఆర్ అంబేద్కర్ ఆశయాలను కాంగ్రెస్ దుర్వినియోగం చేసిందని ఆరోపించారు, సామాజిక సంస్కర్త పట్ల ఆ పార్టీ దారుణంగా ప్రవర్తించిందన్నారు.. అంబేద్కర్‌ను కాంగ్రెస్ ఎప్పుడూ గౌరవించలేదు.. అంబేద్కర్‌ను ఓడించేందుకు కుట్రలు చేసిందని విమర్శించారు.
రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరుగుతున్న చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. భారతదేశం సాధించిన విజయాలు, మన నుంచి ప్రపంచం ఆశించేవి, సామాన్యుల ఆత్మవిశ్వాసం, భారతదేశాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పం గురించి రాష్ట్రపతి తన ప్రసంగంలో వివరంగా చర్చించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరగదని కేంద్ర ఉక్కు మంత్రి స్వయంగా వచ్చి కార్మికులతో మాట్లాడి హామీ ఇచ్చినా.. ఇంకా అనుమానాలు ఎందుకు? అని ప్రశ్నించారు ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్.. ఢిల్లీ పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుత పరిస్థితికి కారణం గత 10 ఏళ్లలో సంస్ద యాజమాన్యం విచ్చలవిడిగా, అనాలోచితంగా తీసుకున్న పలు నిర్ణయాలే అన్నారు.. కానీ, కేంద్ర ఉక్కు మంత్రి స్వయంగా వచ్చి కార్మికులతో…
Raghunandan Rao: లోక్ సభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రసంగించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు.. కుల గణన గురించి గొప్పగా చెప్పే రాహుల్ గాంధీ తెలంగాణ సీఎం పదవి బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
PM Modi: దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూని ఉటంకిస్తూ ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్, రాహుల్ గాంధీలపై విరుచుకుపడ్డారు. విదేశాంగ విధానంపై ఆసక్తి ఉన్నవారు ‘‘జెఎఫ్‌కే ఫర్‌గటెన్ క్రైసిస్’’ బుక్ చదవాలని ప్రధాని మోడీ మంగళవారం పార్లమెంట్లో అన్నారు. ఈ పుస్తకం అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడ, అప్పటి ప్రధాని నెహ్రూ మధ్య సమావేశం గురించి తెలియజేస్తుంది.
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. కొంతమంది నేతలు పేదలతో ఫొటో సెషన్ చేస్తారని.. అదే సభలో పేదల గురించి మాట్లాడితే మాత్రం విసుగ్గా చూస్తారంటూ విమర్శలు గుప్పించారు.