వందేమాతరం అనేది ఒక మంత్రం.. ఒక కల.. ఒక సంకల్పం.. ఒక శక్తి అని ప్రధాని మోడీ అన్నారు. వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చరిత్రకు గుర్తుగా స్మారక తపాలా బిళ్ళ, స్మారక నాణెంను మోడీ ఆవిష్కరించనున్నారు.
ప్రధాని మోడీపై మరోసారి ట్రంప్ ప్రశంసలు కురిపించారు. మోడీ గొప్ప వ్యక్తి అని.. అలాగే మంచి స్నేహితుడు అంటూ కొనియాడారు. ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
ఇండియన్ క్రికెట్ ప్లేయర్ అరుంధతి రెడ్డి ఈరోజు హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈరోజు రాత్రికి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవ్వనున్నారు. వన్డే ప్రపంచకప్ 2025 సాధించిన భారత జట్టులో ఉన్న అరుంధతి రెడ్డకి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సభ్యులు స్వాగతం పలకనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎయిర్‌పోర్ట్‌కు అరుంధతి కుటుంబ సభ్యులు కూడా వెళ్లనున్నారు. అరుంధతి రెడ్డి ప్రస్తుతం భారత మహిళా జట్టులో ఫాస్ట్ బౌలర్‌గా ఉన్నారు. 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో అరుంధతికి ఒక్క…
దేశంలో మరో 4 కొత్త వందే భారత్ ట్రైన్స్ పట్టాలెక్కనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబర్ 8న వారణాసిలో నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైళ్లు వారణాసి-ఖజురహో, లక్నో-సహరాన్పూర్, ఫిరోజ్‌పూర్-ఢిల్లీ, ఎర్నాకులం-బెంగళూరు మార్గాల్లో పరుగులు తీయనున్నాయి. ఈ రైళ్లు ప్రయాణీకులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన, ప్రత్యక్ష కనెక్టివిటీని అందిస్తాయి. ఈ రైళ్లు ప్రయాణ సమయాన్ని తగ్గించడంలో, పర్యాటకాన్ని పెంపొందించడంలో కూడా సహాయపడతాయి. Also Read:Bihar Elections 2025: బీహార్‌లో ప్రశాంతంగా…
బీహార్‌లో తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు వరకు జరగనుంది. ఇదిలా ఉంటే ఉదయం 11 గంటల వరకు 27.65 శాతం పోలింగ్ నమోదైంది. క్రమక్రమంగా ఓటర్లు పోలింగ్ బూత్‌లకు తరలివస్తున్నారు.
PM Modi: మహిళల ప్రపంచ కప్ 2025 గెలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టుకు ప్రధాని నరేంద్ర మోడీ కలిశారు. న్యూఢిల్లీ లోక్ కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో మోడీ ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులతో ప్రధాని ముచ్చటించారు. ప్రపంచ కప్ విజయం సాధించినందుకు ప్రధాని జట్టును అభినందించారు.
జంగిల్ రాజ్ పాలనలో బీహార్‌లో అభివృద్ధి శూన్యమని.. మళ్లీ ఆ రోజులు ఎవరూ కోరుకోవద్దని ప్రధాని మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీహార్‌లో రెండు విడతలో జరిగే నియోజకవర్గాల్లో గురువారం మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్జేడీ నేతృత్వంలోని విపక్ష కూటమిపై విరుచుకుపడ్డారు.
బీహార్‌లో తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 13.13 శాతం ఓటింగ్ నమోదైనట్లుగా ఎన్నికల సంఘం తెలిపింది. ఇక ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్‌లకు తరలివస్తున్నారు.
బీహార్‌లో తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. తొలి విడతలో భాగంగా 121 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 3.75 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటుండగా.. 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Namo Jersey: మహిళల ప్రపంచ కప్ 2025 గెలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నాడు న్యూఢిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులతో ఆయన ముచ్చటించారు. ప్రపంచ కప్ విజయం సాధించినందుకు ప్రధాని మోదీ జట్టును అభినందించారు. ముఖ్యంగా మూడు వరుస ఓటముల తర్వాత టోర్నమెంట్లో జట్టు అద్భుతమైన కం బ్యాక్ ఇవ్వడం, అలాగే సోషల్ మీడియాలో ఎదుర్కొన్న…