Rahul Gandhi: తమిళనాడు ఎన్నికల వేళ ట్విస్ట్.. విజయ్‌కు మద్దతుగా నిలిచిన రాహుల్‌గాంధీ
- తమిళనాడు ఎన్నికల వేళ కీలక పరిణామం
- విజయ్‌కు మద్దతుగా నిలిచిన రాహుల్‌గాంధీ
- ‘జన నాయగన్’ కేంద్రం అడ్డుకుంటోందని దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ ముఖ చిత్రాలు వేగంగా మారుతున్నాయి. అన్ని పార్టీలు అప్రమత్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి-ఇండియా కూటమి అలర్ట్ అయ్యాయి. అధికారం కోసం రెండు కూటమిలు ఆరాటపడుతున్నాయి. ఇంకోవైపు నటుడు, టీవీకే అధినేత విజయ్ కూడా అధికారం కోసం పోరాడుతున్నారు. ప్రస్తుతం ఏ కూటమిలో చేరలేదు. కానీ కొంతమంది నాయకులు విజయ్‌ను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందుకు కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలే ఉదాహరణగా నిలిచాయి.
ఇది కూడా చదవండి: Naresh: నరేష్ 3.0 వెర్షన్ చూస్తారు.. మళ్లీ పెళ్లి చేసుకుంటే తప్పేంటి?
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా సంక్రాంతికి రావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోయింది. దీంతో ప్రస్తుతం ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. కేంద్రం అడ్డుకోవడం వల్లే విజయ్ సినిమా ఆగిపోయిందంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాని మోడీ తమిళ సంస్కృతిపై దాడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తమిళ సంస్కృతిపై దాడి చేస్తోందని.. ఇది కచ్చితంగా తమిళ ప్రజల గొంతును అణిచివేయడమేనని పేర్కొన్నారు. అయినా ఈ విషయంలో కేంద్రం ఎప్పటికీ విజయం సాధించదని తెలిపారు. ఇక రాహుల్ గాంధీ ఆరోపణలపై కేంద్రం ఇంకా స్పందించలేదు.
ఇది కూడా చదవండి: Sreeleela : వరుస ఫ్లాప్స్ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన శ్రీలీల రెమ్యునరేషన్!
జన నాయగన్ సినిమాలో రాజకీయ అంశాలు ఉండడంతో విడుదలకు ఆటంకం ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా స్పష్టత లేకపోవడం ఊహాగానాలు.. విమర్శలకు ఆజ్యం పోసింది. తమిళనాడు ఎన్నికల సమయంలో సినిమా ఏదైనా ప్రభావం చూపిస్తుందన్న కారణంతోనే సినిమా విడుదలకు ఆటంకం ఏర్పడుతున్నట్లు వర్గాలు పేర్కొంటున్నాయి.
తాజావార్తలు
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!