ట్రంప్ సన్నితుడు సెర్గియో గోర్ (38) భారతదేశంలో అమెరికా రాయబారిగా నియమితులయ్యారు. గత నవంబర్‌లో ఆయన నియమితులయ్యారు. తాజాగా ఆయన భారతదేశంలో రాయబారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికా రాయబారిగా భారత్‌లో ఉండటం చాలా బాగుందని తెలిపారు. ఈ అద్భుతమైన దేశానికి స్పష్టమైన లక్ష్యంతో వచ్చినట్లు చెప్పారు. రెండు దేశాల మధ్య సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు వచ్చినట్లు వెల్లడించారు. ప్రధాని మోడీతో ట్రంప్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. త్వరలోనే ట్రంప్ భారతదేశాన్ని సందర్శిస్తారని ఆశిస్తున్నానన్నారు. అది ఒకటి, రెండు సంవత్సరాల్లో జరగొచ్చని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Ahmedabad: పతంగుల పండుగలో సందడి చేసిన మోడీ, ఛాన్సలర్ మెర్జ్
ఇక వచ్చే నెలలో పాక్స్ సిలికాలో పూర్తి సభ్యుడిగా చేరడానికి భారత్‌ను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రకనట చేయడానికి చాలా సంతోషిస్తున్నట్లు చెప్పారు. అమెరికాలో గత నెలలో ప్రారంభమైన పాక్స్ సిలికా కొత్త చొరవను తీసుకొస్తుందన్నారు. గత నెలలో జపాన్, దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్‌డమ్, ఇజ్రాయెల్ ఉన్నాయి. ఇప్పుడు పూర్తి సభ్యుడిగా చేరడానికి భారతదేశాన్ని అమెరికా ఆహ్వానించింది.
ఇది కూడా చదవండి: Trump: ట్రంప్ మరో దూకుడు.. వెనిజులా అధ్యక్షుడిగా ప్రకటన
పాక్స్ సిలికా అనేది కీలకమైన ఖనిజాలు, ఇంధన, ఇన్‌ఫుట్‌ల నుంచి అధునాతన తయారీ, సెమీకండక్టర్లు, ఏఐ అభివృద్ధి, లాజిస్టక్ వరకు.. సాంకేతికకు అవసరమైన సిలికాన్ సరఫరా గొలుసును సురక్షితంగా.. పటిష్టంగా నిర్మించేందుకు ప్రారంభించిన వ్యూహాత్మక కార్యక్రమం. ఇది ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, AI మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ వంటి కీలక రంగాలకు అవసరమైన ముడి ఖనిజాలు, శక్తి, తయారీ ప్రక్రియలను కవర్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సాంకేతికత అభివృద్ధిలో భద్రత, స్థిరత్వాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.

#WATCH | Delhi: After assuming charge as the US Ambassador to India, Sergio Gor says, "I have travelled all over the world with President Trump, and I can attest that his friendship with Prime Minister Modi is real. The United States and India are bound, not just by shared… pic.twitter.com/Wo1ztKxAoi
— ANI (@ANI) January 12, 2026
#WATCH | Delhi: After assuming charge as the US Ambassador to India, Sergio Gor says, "…I've travelled all over the world with President Trump, and I can attest that his friendship with Prime Minister Modi is real. The United States and India are bound not just by shared… pic.twitter.com/j7LUp9DUcF
— ANI (@ANI) January 12, 2026