అర్బన్ డెవలప్మెంట్ పై దక్షిణ–పశ్చిమ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్స్ రీజనల్ మీటింగ్ రాష్ట్రాల మంత్రులతో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్.. సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి పొంగూరు నారాయణ, గుజరాత్ మంత్రి కనుభాయ్ మోహన్ లాల్ దేశాయ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉండాలని మా ప్లాన్ అని తెలిపారు.…
Bihar Politics: బీహార్లో ఘన విజయం తర్వాత ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. నితీష్ కుమార్ సీఎంగా కొనసాగుతారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో క్యాబినెట్ ఫార్ములా కూడా సిద్ధమైంది.
PM Modi: సూరత్లో స్థిరపడిన బీహారీలు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మరోసారి స్పందిస్తూ.. విపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Daggubati Purandeswari: ఎన్డీఏ కూటమి బీహార్లో అద్భుతమైన విజయం సాధించిందని 68 శాతం ఓటింగ్ సాధించడం గొప్ప విశేషమని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. అభివృద్ధి, సంక్షేమం సమపాలల్లో చేసుకుని వెళ్తే విజయాలు ఎలా ఉంటాయో ఇది ఒక నిదర్శనమని ఆమె అన్నారు. బీహార్లో నితీష్ కుమార్ దేశంలోనే అత్యధిక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత ఉందని, బీహార్ ప్రజలు ఎన్డీఏకు మళ్లీ పట్టం కట్టారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఇవే ఫలితాలు ఎన్డీఏకు రాబోతున్నాయని…
Storyboard: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో…ఎన్డీఏ దుమ్ము రేపింది. తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో…ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించింది. ఊహకందని రీతిలో ఈ కూటమి బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది. గెలిచిన పార్టీల నేతలు కూడా అంచనా లేని విధంగా ప్రజలు విజయం కట్టబెట్టారు. 243 స్థానాలకు గాను ఏకంగా 200 స్థానాలకు పైగా గెలిచింది. ఆధిక్యంలో నిలిచింది. ఫలితంగా మరోసారి బిహార్లో ఎన్డీఏకు తిరుగులేదని తాజా ఫలితాలు…
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది. సర్వేల అంచనాలకు మించి సునామీ సృష్టించింది. తిరుగులేని శక్తిగా ఎన్డీఏ కూటమి చరిత్ర సృష్టించింది. ఈ విజయం కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని తీసుకొచ్చింది. కూటమిలో ఉన్న పార్టీలన్నీ ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తున్నాయి.
PM Modi: బీహార్ ముఖ్యమంత్రి, నితీష్ కుమార్, ఇతర జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) నాయకులకు ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో అధికార కూటమి విజయం సాధించినందుకు ఆయన అభినందించారు. ఈ “అద్భుతమైన ప్రజల తీర్పు”తో బీహార్ ప్రజలకు సేవ చేసే శక్తి ఎన్డీఏకు లభిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ఎన్డీఏ బీహార్లో అన్ని రకాల అభివృద్ధిని అందించడం వల్లే ఈ అఖండ విజయం సాధ్యమైందని ప్రధాని వరుస ‘ఎక్స్’ పోస్టుల్లో తెలిపారు. ఈ…
Benjamin Netanyahu: ఢిల్లీ కారు బాంబ్ బ్లాస్ట్ దేశాన్ని మరోసారి కలవరపెట్టింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట వద్ద జరిగిన ఈ ఘటనపై ఇజ్రాయిల్ భారత్కు మద్దతు తెలిపింది. ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ ఈ ఘటనపై స్పందించారు. బాధిత కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేశారు.
PM Modi: ప్రధాని భూటాన్ నుంచి తిరిగి వచ్చారు. దేశ రాజధానిలో అడుగు పెట్టిన వెంటనే పేలుడులో గాయపడిన వారిని పరామర్శించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలోని ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లారు. ఇప్పటికే దాదాపు 100 మంది ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. క్షతగాత్రులకు అందుతున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న బాధితులకు ధైర్యం చెప్పారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ పేలుళ్లపై…