దేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్ పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. జనవరి 17న గౌహతి, కోల్‌కతాలను కలిపే తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభిస్తారని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య సోమవారం తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా టౌన్‌లో ప్రధాని మోడీ దీనిని ప్రారంభిస్తారు. ఈ రైలు కామాఖ్య, హౌరా జంక్షన్ మధ్య వారానికి ఆరు రోజులు నడుస్తుంది. ఈ ప్రీమియం క్లాస్ ట్రైన్ ఛార్జీల వివరాల కోసం ప్రయాణీకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
Also Read:Bangladesh: మతోన్మాద జమాత్ అధినేతతో చైనా రాయబారి భేటీ.. బంగ్లాలో ఏం జరుగుతోంది.?
సోర్సెస్ ప్రకారం, థర్డ్ ఎసి (3ఎసి) తరగతిలో హౌరా నుండి కామాఖ్యకు ఛార్జీ రూ.2,299గా నిర్ణయించినట్లు టాక్. హౌరా నుండి న్యూ జల్పైగురికి ఛార్జీ రూ.1,334, హౌరా నుండి మాల్డా టౌన్‌కు ఛార్జీ రూ.960 ఉంటుందని అంచనా. హౌరా నుండి న్యూ జల్పైగురికి రూ.1724. సెకండ్ AC (2AC) తరగతిలో హౌరా నుండి కామాఖ్యకు రూ.2970. అదే క్లాస్ లో, హౌరా నుండి న్యూ జల్పైగురికి రూ.1724, హౌరా నుండి మాల్డా టౌన్‌కు రూ.1240. మొదటి AC (1AC) తరగతిలో హౌరా నుండి కామాఖ్యకు రూ.3640, హౌరా నుండి న్యూ జల్పైగురికి రూ.2113, హౌరా నుండి మాల్డా టౌన్‌కు రూ.1520 ఉంటుంది.
కామాఖ్య- మాల్డా టౌన్ మధ్య ఛార్జీ.. థర్డ్ ఎసి క్లాస్‌లో రూ.1522, సెకండ్ ఎసి క్లాస్‌లో రూ.1965, ఫస్ట్ ఎసి క్లాస్‌లో రూ.2409గా ఉండనుంది. కామాఖ్య, న్యూ జల్పైగురి మధ్య ఛార్జీ థర్డ్ ఎసి క్లాస్‌లో రూ.962, సెకండ్ ఎసి క్లాస్‌లో రూ.1243, ఫస్ట్ ఎసి క్లాస్‌లో రూ.1524గా అంచనా. అదనంగా, ప్రయాణీకులు టిక్కెట్లపై 5 శాతం GST కూడా చెల్లించాల్సి ఉంటుంది. భారతీయ రైల్వేలు ఈ ప్రీమియం వందే భారత్ స్లీపర్ రైలులో ఛార్జీల నిర్ణయానికి కనీస దూరం 400 కిలోమీటర్లు.
వందే భారత్ స్లీపర్ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి, వీటిలో 11 థర్డ్ ఎసి, 4 సెకండ్ ఎసి, 1 ఫస్ట్ ఎసి కోచ్‌లు ఉంటాయి. థర్డ్ ఎసిలో 611 బెర్తులు, 188 సెకండ్ ఎసి, 24 ఫస్ట్ ఎసి బెర్తులు ఉన్నాయి. ఈ రైలు మొత్తం 823 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. దీని వేగం గంటకు 180 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
Also Read:Good News : రైతన్నకు శుభవార్త.. సన్న ధాన్యానికి బోనస్ విడుదల
ఈ రైలులోని బెర్తులు ప్రత్యేకంగా రూపొందించారు. మందపాటి, మృదువైన పరుపులతో ఉంటాయి. దూర ప్రయాణాలు కూడా అలసట లేకుండా ఉంటుంది. అధునాతన సస్పెన్షన్ వ్యవస్థ శబ్దాన్ని తగ్గించడంతో పాటు నిశ్శబ్దమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని నిర్ధారిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణీకులకు సహాయం చేయడానికి కవచ్ యాంటీ-కొలిషన్ సిస్టమ్, ఎమర్జెన్సీ టాక్-బ్యాక్ సిస్టమ్ ఉన్నాయి. కోచ్‌లు ఎల్లప్పుడూ క్రిములు లేకుండా, సురక్షితమైన, పరిశుభ్రమైన ప్రయాణాన్ని అందిస్తాయి.