భారతీయులందరికీ ఈరోజు ముఖ్యమైన రోజు అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ప్రధాని మోడీతో కలిసి ఆయోధ్య రామాలయంపై కాషాయ జెండాను మోహన్ భగవత్ ఆవిష్కరించారు
అయోధ్య రామమందిరంపై కాషాయ జెండాను ప్రధాని మోడీ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ భావోద్వేగ ప్రసంగం చేశారు. ఎన్నో ఏళ్ల సంకల్పం ఈరోజు నెరవేరిందని తెలిపారు. ధ్వజారోహణతో ఎన్నో ఏళ్ల నాటి గాయాలు మానిపోయాయని చెప్పుకొచ్చారు. రామమందిర నిర్మాణానికి సహకరించిన ప్రతి భక్తుడికి నివాళులు అర్పిస్తున్నానన్నారు.
అయోధ్య శ్రీరామ్‌లల్లా ఆలయంలో ధ్వజారోహణం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రామాలయంపై 22 అడుగుల కాషాయ జెండాను మోడీ ఆవిష్కరించారు. రామ జన్మభూమి ట్రస్ట్ సభ్యుల సమక్షంలో జెండా ఆవిష్కరణ జరిగింది. సాధువులు, ప్రముఖులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..! ‘‘ధ్వజ్ ఆరోహణ్’’…
ప్రధాని మోడీ మంగళవారం అయోధ్యలో పర్యటించనున్నారు. రామాలయంలో 22 అడుగుల కాషాయ జెండాను మోడీ ఆవిష్కరించనున్నారు. రామ జన్మభూమి ట్రస్ట్ సభ్యుల సమక్షంలో ఈ జెండా ఆవిష్కరణ జరగనుంది. సాధువులు, ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇది కూడా చదవండి: Off The Record: టీడీపీకి అత్యంత సమస్యాత్మకంగా ఆ నియోజకవర్గం..! 2020 ఆగస్టులో రామమందిరానికి ప్రధాని మోడీ శంకుస్థాపం చేశారు. ఇక 2024 జనవరి 22న రామమందిరం ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైంది. మళ్లీ ఇన్ని…
భారతదేశ 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో సూర్యకాంత్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేచించారు.
దక్షిణాఫ్రికాలోని జోహాన్స్‌బర్గ్ వేదికగా జరుగుతున్న జీ20 లీడర్స్ సమ్మిట్‌కు ప్రధాని మోడీ శుక్రవారం ఉదయం బయల్దేరి వెళ్లారు. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు దక్షిణాఫ్రికాలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో మోడీ ప్రసంగించనున్నారు.
Donald Trump: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో పాకిస్తాన్‌పై భారీ దాడులు నిర్వహించింది. పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసి వందలాది మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది. పాకిస్తాన్ సైన్యం కవ్వింపులకు దిగడంతో పాక్ వైమానిక దళానికి చెందిన 10 ఎయిర్ బేసుల్ని భారత్ ధ్వంసం చేసింది.
PM Modi : సత్యసాయి బాబా సేవకు ప్రత్యక్ష రూపం అని అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోడీ.. పుట్టపర్తిలో జరిగిన శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో ఆయన మాట్లాడుతూ.. సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. పుట్టపర్తి కేవలం ఒక ప్రాంతం కాదు, అది ఆధ్యాత్మిక శక్తి, ప్రేమ, మానవానుకూలతలకు ప్రతీక. సత్యసాయి భౌతికంగా మనతో లేకపోయినా.. ఆయన ప్రేమ, ఆయన బోధనలు, ఆయన సేవా భావం ఇంకా కోట్లాది…
PM Modi: భారతీయ కళలు, సంప్రదాయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం ప్రధాని నరేంద్రమోడీ ప్రత్యేకత. దీంతో పాటు మేకిన్ ఇండియా ఉత్పత్తుల్ని కూడా ప్రమోట్ చేస్తుంటారు. భారతీయులు, దేశంలోనే తయారయ్యే వస్తువుల్ని కొనుగోలు చేయాలని సూచిస్తుంటారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు మోడీ ధరించిన ‘‘వాచ్’’పై అందరి దృష్టి నెలకొంది. జైపూర్ వాచ్ కంపెనీ తయారు చేసిన ప్రత్యేకమైన లగ్జరీ వాచ్ మోడీ చేతికి కనిపించింది. దీని పేరు ‘‘రోమన్ బాఘ్’’. ఈ వాచ్‌లో 1947లో విడుదలైన ఒక…