మంత్రి నారా లోకేష్‌కు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. మొంథా తుపానుకు సంబంధించి కేంద్రంతో సమన్వయ బాధ్యతలను లోకేష్‌కు సీఎం చంద్రబాబు అప్పగించారు. తుపానుకు సంబంధించి సీఎం చంద్రబాబు ఈరోజు ఉదయం కీలక సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా ముందు జాగ్రత్త చర్యలతో పాటు తుఫాన్ ప్రారంభం అయ్యే ముందు పరిస్థితి అంచనా వేసి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గాలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి విద్యుత్తు అంతరాయం లేకుండా చూడాలన్నారు. హోర్డింగ్స్ విషయంలో కూడా తగిన చర్యలు…
Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై ప్రధాని నరేంద్రమోడీని ప్రశంసించారు. యూపీఏ ప్రభుత్వ సమయంలో పాకిస్తాన్ ప్రతీ రోజూ దాడులు చేసేదని, ఓటు బ్యాంకు కోల్పోతామనే భయంతో కాంగ్రెస్, ఆర్జేడీలు మౌనంగా ఉన్నాయని విమర్శించారు. బీహార్‌లోని ఖగారియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన షా, ఉరి, పుల్వామా, పహల్గామ్లలో జరిగిన ఉగ్రవాద దాడుల తర్వాత ప్రతీకారం తీర్చుకోవడం ద్వారా ప్రధాని మోదీ భారతదేశాన్ని సురక్షితంగా ఉంచారని…
ప్రధాని మోడీ శుక్రవారం బీహార్‌లో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న గ్రహీత కర్పూరి ఠాకూర్ గ్రామం సమస్తిపూర్ నుంచి మోడీ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. తొలుత కర్పూరి ఠాకూర్‌కు మోడీ నివాళులర్పించనున్నారు.
PM Modi: బీహార్ ఎన్నికల ప్రచారంలోకి ప్రధాని నరేంద్రమోడీ దిగారు. బీహార్‌లోని బీజేపీ కార్యకర్తలతో ప్రధాని గురువారం మాట్లాడుతూ.. బీహార్‌లో ‘‘జంగిల్ రాజ్’’ మరో 100 ఏళ్లు అయినా మరిచిపోలేమని, ఆ కాలపు అనుభవానలు యువతరానికి అందించాలని రాష్ట్రంలోని సీనియర్ ఓటర్లను ఆయన కోరారు
ప్రధాని మోడీ శుక్రవారం బీహార్‌లో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల ఎన్నికల ర్యాలీలు నిర్వహించనున్నారు. అయితే ఎన్నికల ప్రచారాన్ని దివంగత మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న కర్పూరి ఠాకూర్ గ్రామం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
ప్రధాని మోడీ మరో విదేశీ పర్యటనకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల గాజా శాంతి శిఖరాగ్ర సమావేశానికి దూరంగా ఉన్నారు. ఈజిప్టు వేదికగా జరిగిన ఈ సమావేశానికి ట్రంప్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించినా మోడీ వెళ్లలేదు. తాజాగా మలేషియా వేదికగా అక్టోబర్ 26 నుంచి 28 వరకు ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా హాజరవుతున్నారు. ఈ సమావేశానికి కూడా ప్రధాని మోడీ వెళ్లడం లేదని తెలుస్తోంది.
ఓ వైపు సముద్రం.. ఇంకోవైపు భారతమాత సైనికుల బలం తనతో ఉందని ప్రధాని మోడీ అన్నారు. గోవాలోని కార్వార్ తీరంలో ఐఎన్ఎస్ విక్రాంత్ దగ్గర సాయుధ దళాల సిబ్బందితో కలిసి మోడీ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఆపరేషన్ సిందూర్ గుర్తుగా ఈ ఏడాది దీపావళి వేడుకలు నౌకాదళంతో జరుపుకున్నారు.
భారత్‌ను మళ్లీ ట్రంప్ హెచ్చరించారు. రష్యా దగ్గర చమురు కొనుగోలు నిలిపివేయకపోతే భారీగా సుంకాలు కొనసాగుతాయని వార్నింగ్ ఇచ్చారు. రష్యా దగ్గర చమురు కొనుగోలు క్రమక్రమంగా తగ్గి్స్తామని ప్రధాని మోడీ తనతో ఫోన్ చెప్పారని గత వారం ట్రంప్ వ్యాఖ్యానించారు.
త్వరలో రష్యా చమురు కొనుగోలు భారత్ నిలిపివేస్తుందని మరోసారి ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇటీవలే ప్రధాని మోడీతో మాట్లాడినప్పుడు తనకు హామీ ఇచ్చారని.. రష్యా దగ్గర చమురు కొనుగోలు నిలిపివేస్తున్నట్లు చెప్పారని ట్రంప్ పేర్కొన్నారు.
ట్రంప్‌ను చూసి ప్రధాని మోడీ భయపడుతున్నారంటూ కాంగ్రస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యల్ని అమెరికా గాయని మేరీ మిల్బెన్ ఖండించారు. రాహుల్ గాంధీకి భారత ప్రధాని అయ్యే చతురత లేదని ఆమె విమర్శించారు. ట్రంప్‌కు మోడీ భయపడరని.. అమెరికాతో భారత దౌత్యం వ్యూహాత్మకమైందని రాసుకొచ్చారు.