Abhishek Banerjee: ‘‘ఇక సర్జికల్ స్టైక్స్ వద్దు, పీఓకేని కలిపేయండి’’.. తృణమూల్ నేత..
- ఇక సర్జికల్ స్ట్రైక్స్ వద్దు, పీఓకేని స్వాధీనం చేసుకోండి..
- కేంద్రానికి సూచించిన టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Banerjee: పహల్గామ్ ఉగ్రవాద దాడికి పాకిస్తాన్‌కి గుణపాఠం నేర్పించాల్సిన సమయం ఆసన్నమైందని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆదివారం అన్నారు. పాకిస్తాన్ ఆక్రమించిన మన భూభాగాలను తిరిగి పొందాలని అన్నారు. ఇక సర్జికల్ స్ట్రైక్స్ వద్దని పీఓకేని స్వాధీనం చేసుకోవాలని కేంద్రానికి సూచించారు. “పాకిస్తాన్‌కి అర్థమయ్యే భాషలో వారికి పాఠం నేర్పాల్సిన సమయం ఇది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)ని తిరిగి పొందాల్సిన సమయం ఇది.” అని ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
Read Also: GVMC New Mayor: గ్రేటర్ విశాఖ మేయర్ అభ్యర్థి ఖరారు… రేపే ఎన్నిక..
Also Read
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
రాజకీయాలకు అతీతంగా భారత ప్రభుత్వానికి అండగా నిలిచే సమయం ఆసన్నమైందని చెప్పారు. గత కొన్ని రోజులుగా తాను ప్రధాన మీడియా, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నవారి ప్రవర్తనను నిశితంగా గమనిస్తున్నానని, పహల్గామ్ దాడికి కారణమైన భద్రతా లోపాలను పరిశోధించే బదులుగా, వారి నిర్దిష్ట రాజకీయ ప్రయోజనం కోరకు కథనాన్ని ముందుకు తీసుకురావడంపై ఎక్కువ దృష్టి సారించినట్లు కనిపిస్తుందని పరోక్షంగా బీజేపీ గురించి అన్నారు.
ఏప్రిల్ 22న కాశ్మీర్ పహల్గామ్ సమీపంలోని బైసరన్ ప్రాంతంలో టూరిస్టులపై ముష్కరులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో 26 మంది మరణించారు. ఈ దాడికి పాల్పడింది తామే అని పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. మరోవైపు, పాక్ ప్రమేయంపై స్పష్టమైన ఆధారాలు ఉండటంతో భారత్ దౌత్యపరంగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందం రద్దు చేయడంతో పాటు సరిహద్దుల్ని మూసేస్తోంది. పాక్ జాతీయులకు వీసాల రద్దుతో పాటు, వారిని వారి దేశానికి వెళ్లాలని ఆదేశించింది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!