CM Chandrababu: ఇక అమరావతి అభివృద్ధి అన్స్టాపబుల్..
- ఇక అమరావతి అభివృద్ధి అన్స్టాపబుల్ అంటున్న సీఎం..
- విట్ యూనివర్సిటీలో 'వి లాంచ్‌పాడ్ 2025 - స్టార్టప్ ఎక్స్‌పో'కు హాజరు..
- వైజాగ్ లో గూగుల్ సెంటర్ వస్తుంది..
- కొత్త ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తి కానుంది..
- ప్రధాని నేతృత్వంలో మెకిన్ ఇండియా ముందుకు వెళ్తున్నాం..
- దేశంలోనే కర్నూల్ లో డ్రోన్ సిటీ నిర్మాణం చేస్తున్నాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఇక అమరావతి అభివృద్ధి అన్స్టాపబుల్ అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాజధాని అమరావతిలోని విట్ యూనివర్సిటీలో నిర్వహిస్తోన్న ‘వి లాంచ్‌పాడ్ 2025 – స్టార్టప్ ఎక్స్‌పో’కు హాజరైన సీఎం.. యూనివర్సిటీ ప్రాంగణంలో గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ బ్లాక్, వి.వి.గిరి బ్లాక్, దుర్గాబాయి దేశ్‍ముఖ్ బ్లాక్ నూతన భవనాలను ప్రారంభించారు.. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఇక అమరావతి అభివృధి ఆన్ స్టాపబుల్.. వైజాగ్ లో గూగుల్ సెంటర్ వస్తుంది.. కొత్త ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తి కానుంది. ప్రధాని నేతృత్వంలో మెకిన్ ఇండియా ముందుకు వెళ్తున్నాం.. దేశంలోనే కర్నూల్ లో డ్రోన్ సిటీ నిర్మాణం చేస్తున్నాం.. సాటిలైట్ కూడా ఇక్కడ నుండి పంపే ఏర్పాటు చేస్తున్నాం.. విద్యార్థుల సాంకేతికతను అందిపుచ్చుకోండి.. దేశం అభివృధిలో సాంకేతికత కీలకం అన్నారు.
Read Also: TTD : తిరుపతిలో ఇక రూమ్‌కోసం టెన్షన్ లేదు..
Also Read
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
29 వేల మంది రైతులు అమరావతికి భూములు ఇచ్చారు.. వాళ్లలో కొందరిని దత్తత తీసుకోమని కోరుతున్నా అన్నారు సీఎం చంద్రబాబు.. విద్యార్థులు చాలా ఉత్సాహంగా ఉన్నారు.. విద్యార్థుల తెలుగు దేశం జెండా తీసుకు వచ్చారు.. అయితే, విద్యార్థులకు రాజకీయాలు అవసరం అన్నారు. 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే విట్ మరో లా ఉండేది.. ల్యాండ్ పూలింగ్ అనే వినూత్న పద్ధతిలో అమరావతికి భూములు సేకరించాం.. వేల కోట్ల విలువైన భూములకు డబ్బు లు లేకుండా రాజధాని నిర్మాణం చేస్తున్నాం అని తెలిపారు.. ఇక, విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సీఎం సమాధానం ఇస్తూ.. రైట్ మైండ్ సేట్ తో ఎందరో మహానుభావులుగా ఎదిగారు.. ఒకసారి విఫలమైనా.. మరో సారి ముందుకు పోండి.. విఫలమైనామని నిరుత్సాహ పడకండి అని సూచించారు..
Read Also: CM Revanth Reddy : కేసీఆర్‌కు నేను సీఎం అయిన రెండో రోజే గుండె పగిలింది
మే 2న ప్రధాని మోడీ అమరావతికి వస్తున్నారు.. మళ్లీ అమరావతి పనులు ప్రారంభం అవుతాయి అని తెలిపారు చంద్రబాబు.. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పారదర్శకత తీసుకొచ్చాం.. రాబోయే రోజుల్లో భవిష్యత్తు అంతా ఏఐదే.. నేనెప్పుడూ భవిష్యత్తు టెక్నాలజీ గురించి మాట్లాడుతా.. దాన్ని అందిపుచ్చుకున్న వాళ్లు అభివృద్ధి చెందుతారని వెల్లడించారు.. కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా.. భారత్‌తో పెట్టుకుంటే ఎవరైనా మటాష్ అయిపోవాల్సిందే అని హెచ్చరించారు.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజలంతా సంఘటితం కావాలి అని పిలుపునిచ్చారు.. స్వర్ణాంధ్ర-2047కు రోడ్ మ్యాప్ సిద్ధం చేశాం.. విద్యార్థుల భవిష్యత్ ఇచ్చేందుకు ఏమి చేయాలో చేస్తాం.. విశ్వనాధన్ 20 ఏళ్ళ పాటు పార్లమెంటు లో ఉన్నారు.. 170 మందితో విట్ ను వెల్లూరు లో ప్రారంభించారు.. 2014 లో మీరు గెలిస్తే రాజధానిలో విట్ ఏర్పాటు చేస్తామని విశ్వనాథo అన్నారు.. అన్నట్లే అమరావతిలో విట్ ఏర్పాటు చేశారు.. భవిష్యత్ ఐటీ అని చెప్పి ఐటీని అభివృధి చేశాం. ప్రపంచంలోనే హైదరాబాద్ ఐటీ హబ్ గా తీర్చిదిద్దాం.. తెలుగు వారు ప్రపంచo లో ట్రెండ్ సెట్ చేశారు.. అమరావతి త్వరలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ త్వరలో ఏర్పాటు చేస్తున్నాం.. ఐటీ ద్వారా తెలుగు ట్రెండ్ సెట్టర్ గా ఉన్నారు.. అమరావతి విట్ లో 95 శాతం ప్లేస్ మెంట్స్ వస్తున్నాయి .. ఉద్యోగాలతో సంతృప్తి చెందవద్దు.. మీరే ఉద్యోగాలు ఇచ్చే విధంగా మీరు ఎదగాలి.. అమరావతి తో పాటు రాష్ట్రంలో 5 చోట్ల రతన్ టాటా ఇన్నోవేటివ్ హబ్ లు ఏర్పాటు చేస్తున్నాం అన్నారు..
తాజావార్తలు
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!