పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కేంద్ర పెద్దలు భవిష్యత్ కార్యాచరణపై కీలక చర్చలు జరుపుతున్నారు. సోమవారం ఉదయం ప్రధాని మోడీతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సైన్యం సన్నద్ధత గురించి ఇరువురి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహన్‌తో రాజ్‌నాథ్ ఆదివారం భేటీ అయ్యారు. ఆ సమావేశంలో మన సైన్యం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను రక్షణమంత్రి ప్రధానికి వివరించారు. భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ కూడా పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Pahalgam Terror Attack: దాడిని ఖండిస్తూ జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం
ఇక ఈ భేటీ తర్వాత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా సమావేశం జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో రక్షణపై చర్చించనున్నారు. ప్రధాని మోడీతో రాజ్‌నాథ్‌సింగ్ చర్చించిన అంశాలు.. ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు వేట సాగిస్తున్నాయి. ఈ అంశంపై కూడా చర్చకు వచ్చే ఛాన్సుంది. ఢిల్లీలో వరుస భేటీలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా తుర్కియే సైనిక విమానాలు పాక్‌లో మోహరించాయి. పాక్ సైన్యానికి అవసరమైనవి చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Delhi: ప్రధాని మోడీతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కీలక భేటీ.. ఉత్కంఠ రేపుతున్న చర్చలు
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్‌తో భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపివేసింది. అంతేకాకుండా పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసింది. అలాగే అటారీ సరిహద్దు మూసివేసింది. తాజాగా పాక్‌కు సంబంధించిన 16 యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం విధించింది. ఇలా ఒక్కొక్కటిగా భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక ఉగ్ర దాడులకు పాల్పడ్డ నిందితుల సమాచారం అందిస్తే రూ.20లక్షల రివార్డ్ ప్రకటించింది. గత మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల కొద్ది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువగా కొత్తగా పెళ్లైన వారు ఉండడం బాధాకరం.