India Pakistan: గడువులోగా పాకిస్తానీలు భారత్ నుంచి వెళ్లకుంటే.. ఎలాంటి శిక్షలు పడుతాయో తెలుసా..?
- గడువులోగా పాకిస్తాన్ జాతీయులు వెళ్లకుంటే జైలు శిక్ష..
- జరిమానాతో పాటు జైలు శిక్ష విధించే అవకాశం..
- పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌పై భారత్ దౌత్యచర్యలు మొదలుపెట్టింది. ఈ చర్యల్లో భాగంగా ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసింది. పాక్ జాతీయులకు వీసాలు రద్దు చేయడంతో పాటు డెడ్‌లైన్ లోగా వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల్లో ఉంటున్న పాకిస్తానీయులను గుర్తించి, వెంటనే బహిష్కరించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాలను ఆదేశించారు. అన్ని రకాల వీసాల ఉన్నవారు ఏప్రిల్ 26 వరకు దేశం విడిచి వెళ్లాలని, వైద్య వీసాలు కలిగిన వారు 29లోగా వెళ్లాలని భారత్ ఆదేశించింది. ఈ మేరకు భారత్-పాక్ సరిహద్దు ‘‘అట్టారీ-వాఘా’’ బోర్డర్ పాక్ వెళ్లావారితో కిటకిటలాడుతోంది.
ఒక వేళ, గడువులోగా భారత్ విడిచివెళ్లకుంటే సదుర పాక్ జాతీయుడిని అరెస్ట్ చేసి విచారించి, మూడు ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా గరిష్టంగా రూ. 3 లక్షల జరిమానా లేదా రెండింటిని శిక్షగా విధించవచ్చు. ఏప్రిల్ 04న కొత్తగా అమలులోకి వచ్చి ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్-2025 ప్రకారం.. గడువు ముగిసిపోవడం, వీసా షరతుల్ని ఉల్లంఘించడం, నిషేధిత ప్రాంతాలను అతిక్రమించడం వంటివి చేస్తే ఈ శిక్షలు విధించవచ్చు.
Also Read
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
- Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
‘‘ (ఏ) విదేశీయుడైనా, వీసా జారీ చేయబడిని కాలానికి మించి భారతదేశంలో ఏదైనా ప్రాంతంలో ఉన్నా లేదా సెక్షన్ 3లోని నిబంధనల్ంని ఉల్లంఘించినా, చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలు లేకుండా భారత్‌లో ఉన్నా, వీసా ఉల్లంఘనలకు కారణమయ్యే ఏదైనా చర్యకు పాల్పడినా,
(బి) సెక్షన్లు 17,19 కాకుండా ఈ చట్టంలోని ఏదైనా ఇతర నిబంధనల్ని లేదా దాని కింద చేసిన ఏదైనా నియమాన్ని, ఆదేశాన్ని లేదా చట్ట ప్రకారం ఇచ్చిన ఏదైనా సూచనను, ఆదేశాన్ని ఉల్లంఘించినా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రూ.3 లక్షల వరకు జరిమానా లేదా రెండు శిక్షలు విధించే అవకాశం ఉంది’’ అని చట్టం చెబుతోంది.
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?