పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సంతాపం వ్యక్తం చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తన హృదయం చాలా విచారంగా ఉందని.. ప్రతి భారతీయుడు కోపంతో మండిపోతున్నారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. పహల్గాంలో ఉగ్రవాదులు పిరికితనాన్ని ప్రదర్శించారని విమర్శించారు. శత్రువులకు దేశ అభివృద్ధి నచ్చడం లేదని..
ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి షెడ్యూల్ ఖరారు ఖరారైంది. మే 2న సాయంత్రం 4 గంటలకు రాజధాని అమరావతి పునః నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 15 నిమిషాలు రోడ్డు షో, గంట పాటు సభ ఉంటుంది. ఈ కార్యక్రమం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం వెనక బహిరంగ సభ వేదికను ఎంపిక చేసింది. అక్కడి నుంచే రాజధాని పనుల పునః ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీని కూడా…
MIB: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. గత నాలుగు రోజుల నుంచి ఇటు భారత్, అటు పాకిస్తాన్ మీడియా ఛానెళ్లలో ఇదే ప్రధానాంశంగా మారింది. భారత మీడియా మిలిటరీ కార్యకలాపాల గురించి ఎప్పటికప్పుడు నివేదిస్తోంది. ఇదిలా ఉంటే, మిలిటరీ కార్యకలాపాలకు సంబంధించిన కవరేజ్ని నిలిపేయాలని శనివారం సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ (MIB) మీడియాకు కీలక ఆదేశాలు జారీ చేసింది
Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఎలాంటి దాడి చేస్తుందో అని పాకిస్తాన్ హడలి చేస్తోంది. బయటకు తన ప్రజల మెప్పు కోసం ఎన్నో బీరాలు పలుకుతున్నప్పటికీ, లోలోపల మాత్రం భయపడుతోంది. ఇప్పటికే, ఆర్థిక దరిద్రంలో పాకిస్తాన్ ఉంది. యుద్ధం చేస్తే ఆ దేశ పరిస్థితి మరింతగా దిగజారుతుందనేది అక్కడి ప్రభుత్వానికి చాలా బాగా తెలుసు. యుద్ధం చేయాల్సి వస్తే, మూడు రోజులకు సరిపడే చమురు నిల్వలు మాత్రమే ఉన్నాయి. మరోవైపు, ఒక వేళ యుద్ధం కోసం…
Pakistan: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది సాధారణ పౌరులు, ముఖ్యంగా మతం ఆధారంగా హిందువుల్ని లక్ష్యంగా చేయడం పట్ల యావత్ దేశం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. ఈ మేరకు పాకిస్తాన్పై తీవ్ర ప్రతీకారం తీర్చుకోవాలని కేంద్రాన్ని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
పహల్గామ్ ఉగ్ర దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. కాశ్మీర్ సమస్య చాలా ఏళ్లుగా ఉందని.. ఆ సమస్యనే పాకిస్థాన్-భారత్ పరిష్కరించుకోవాలని సూచించారు.
CM Chandrababu: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఏపీ సీఎం చంద్రబాబు కలిశారు. ఈ మేరకు ఉగ్రవాదులది పిరికిపంద చర్య, ఈ హింసను ఖండిస్తున్నామన్నారు. పహల్గామ్ బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తాం.. దేశ భద్రతను కాపాడే విషయంలో మోడీ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ఉంటుంది.
Iran: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే భారత్ పాక్కి వ్యతిరేకంగా దౌత్య యుద్ధాన్ని మొదలుపెట్టింది. ‘‘సింధు జల ఒప్పందం’’ని రద్దు చేసింది. సింధు, దాని ఉపనదుల నుంచి ఒక్క చుక్క నీరు పాక్కి వెళ్లకుండా ప్రణాళికలు రచిస్తోంది.
Pakistan: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబాకు అనుబంధంగా ఉన్న ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడినట్లు ప్రకటించింది. అయినప్పటికీ, ఈ దాడి గురించి పాకిస్తాన్ నుంచి ఎలాంటి స్పష్టమైన ఖండన రాలేదు. దీనికి తోడు, భారత్ దాడి చేస్తే ప్రతిదాడి ఎలా చేయాలనే దానిపైనే దాయాది దేశం చూపు ఉంది. ఆ దేశం నుంచి ఉగ్రవాదులు వచ్చి దాడులకు పాల్పడినట్లు తెలిసినా కూడా తమ వారు కాదని ఇంకా బుకాయిస్తోంది.
Indus water: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో, పాకిస్తాన్కి సరైన రీతిలో బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమైంది. పాకిస్తాన్ జీవనాడి అయిన సింధు, దాని ఉపనదులు నుంచి ఒక్క చుక్క నీరు దక్కకుండా భారత్ వ్యూహాన్ని రూపొందిస్తోంది. ఇప్పటికే 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. పాకిస్తాన్ భారత్ నిర్ణయాన్ని తప్పుబడుతూ.. ఇది ‘‘యుద్ధ చర్య’’గా అభివర్ణించింది. సింధు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న నిర్ణయాన్ని భారత్, పాక్ ప్రభుత్వానికి అందించింది.