BJP vs Congress: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయం మొదలైంది. కాంగ్రెస్ ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ..‘‘అవసరమైన సమయాల్లో మిస్ అవుతారు’’ అని కామెంట్ చేసింది. ప్రధానిని సూచించే ఒక ఫోటోని పోస్ట్ చేసి, దానికి తల లేకుండా ఉంచింది. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్‌ని టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకులు పాక్ పై ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లండి అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎంపీ చామల మాట్లాడుతూ.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి 140 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రజలు గమనించాలని కోరారు.…
Pahalgam terror Attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పక్కా పథకం ప్రకారమే, టెర్రరిస్టులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దాడిలో ప్రాణాలతో బయటపడిన వారు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలతో ఉగ్రవాదుల కుట్ర వెలుగులోకి వచ్చింది. తప్పించుకోవడానికి మార్గం లేకుండా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇద్దరు ఉగ్రవాదులు ఎంట్రీ గేట్ నుంచి రాగా, ఒకరు ఎగ్జిట్ గేట్ నుంచి వచ్చారు. నాలుగో ఉగ్రవాది వీరికి సపోర్ట్ చేయడానికి అడవిలో దాగి ఉండొచ్చని దర్యాప్తు…
Canada Elections: కెనడా ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీ వరసగా మూడోసారి ఘన విజయం సాధించి, అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధమైంది. కెనడా ప్రధానిగా మార్క్ కార్నీ బాధ్యతలు తీసుకోనున్నారు. కెనడా పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో మొత్తం 343 స్థానాలున్నాయి.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత కేంద్రం వరుస సమీక్షలు నిర్వహిస్తోంది. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక ఉగ్ర దాడి తర్వాత నియంత్రణ రేఖ వెంబడి (ఎల్ఓసీ) పాకిస్థాన్ వరుస కాల్పులకు తెగబడుతోంది. భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది.
ప్రధాని మోడీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే లేఖ రాశారు. పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో కాంగ్రెస్ అధ్యక్షుడు కోరారు.
ఇక అమరావతి అభివృద్ధి అన్‌స్టాపబుల్ అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాజధాని అమరావతిలోని విట్ యూనివర్సిటీలో నిర్వహిస్తోన్న 'వి లాంచ్పాడ్ 2025 - స్టార్టప్ ఎక్స్పో'కు హాజరైన సీఎం.. యూనివర్సిటీ ప్రాంగణంలో గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ బ్లాక్, వి.వి.గిరి బ్లాక్, దుర్గాబాయి దేశ్‌ముఖ్ బ్లాక్ నూతన భవనాలను ప్రారంభించారు..
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కేంద్ర పెద్దలు భవిష్యత్ కార్యాచరణపై కీలక చర్చలు జరుపుతున్నారు. సోమవారం ఉదయం ప్రధాని మోడీతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ భేటీ అయ్యారు.
India Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌పై భారత్ దౌత్యచర్యలు మొదలుపెట్టింది. ఈ చర్యల్లో భాగంగా ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసింది. పాక్ జాతీయులకు వీసాలు రద్దు చేయడంతో పాటు డెడ్‌లైన్ లోగా వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.
Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడికి కారణమైన పాకిస్తాన్ ఇప్పుడు వణుకుతోంది. భారత్ ఎలా స్పందిస్తుందో అని రోజులు లెక్కబెట్టుకుంటోంది. ముఖ్యంగా, పాకిస్తాన్‌ని కలిపి ఉంచేది ఆ దేశపు ఆర్మీ. అయితే, అలాంటి పాకిస్తాన్ ఆర్మీలోనే భారత్ దేశం అంటే భయం స్పష్టంగా కనిపిస్తోంది. భారత్ ఏ విధంగా తమపై విరుచుకుపడుతుందో తెలియక పాక్ ఆర్మీ నిలువెల్లా వణికిపోతోంది. ఇప్పటికే, పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ జనానికి కనిపించకుండా ఉన్నాడు.