PM Modi: అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన!
- అమరావతి పునర్నిర్మాణ పనులకు మోడీ శంకుస్థాపన
- రూ.58 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం
- తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి పునర్నిర్మాణ పనులకు శుక్రవారం వెలగపూడిలో ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. సభా వేదిక పైనుంచే 18 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేశారు. రాజధాని పనులు సహా రూ.58 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. రూ.49,040 కోట్ల విలువైన రాజధాని పనులకు, రూ.8 వేల కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులకూ ప్రధాని శంకుస్థాపన చేశారు. పనుల ప్రారంభానికి ప్రతీకగా అమరావతి పైలాన్‌ను ప్రధాని ఆవిష్కరించారు.
అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. తల్లి దుర్గ భవానీ కొలువైన పుణ్య భూమిపై మీ అందరినీ కలవడం నాకు ఆనందంగా ఉందని ప్రధాని అన్నారు. ‘అమరావతి స్వప్నం సాకారం అవుతున్నట్లు కనిపిస్తోంది. చారిత్రక పరంపర, ప్రగతి రెండు కలిసి పయనిస్తున్నట్లు కనిపిస్తుంది. ఒక కొత్త అమరావతి, కొత్త ఆంధ్రప్రదేశ్, బౌద్ధ వారసత్వం, ప్రగతి కలగలిసిన ప్రాంతం ఇది. అమరావతి ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్‌ను ఆధునాతన ప్రదేశ్‌గా మార్చే శక్తి అమరావతికి ఉంది. ఏపీలోని ప్రతి ఒక్కరి కలలను అమరావతి సాకారం చేస్తుంది’ అని అన్నారు.
Also Read
- Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
- 5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్‌లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
Also Read: PM Modi: ప్రధాని మోడీ మరో పేరును రివీల్ చేసిన పవన్ కల్యాణ్.. అదేంటో తెలుసా?
‘ఏఐ, టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, విద్యా రంగాల్లో అమరావతి ముందు ఉంటుంది. ఇవి కేవలం శంకుస్థాపనలు కాదు ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్‌కు నిదర్శనం. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇది శుభసంకేతం. రికార్డు స్పీడ్‌లో పనులు పూర్తి చేయడానికి కేంద్రం సహకరిస్తుంది. అమరావతిలో మౌలిక సదుపాయల కోసం కేంద్రం సహకరించింది. అమరావతికి ఉన్న ఆటంకాలు తొలగిపోయి ఇప్పుడు పనులు వేగంగా జరుగుతున్నాయి. చంద్రబాబు నాకు టెక్నాలజీ వాడకం గురించి చెప్పారు. నేను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఏపీ సీఎంగా చంద్రబాబు టెక్నాలజీ వాడకాన్ని గమనించాను’ అని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
ట్రెండింగ్
-
ఆఫర్లే ఆఫర్‌లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!