PM Modi On Polavaram: అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభోత్స కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 18 కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఇక, ఆయన మాట్లాడుతూ.. దేశంలో సాగు నీరుకు ఇబ్బంది లేకుండా నదుల అనుసంధానం చేస్తున్నాం అని పేర్కొన్నారు. ప్రతి పొలానికి నీరు అందించాలి.. రైతులకు ఎలాంటి సమస్య ఉండకూడదనేది మా ప్రభుత్వ లక్ష్యం అని చెప్పుకొచ్చారు. అలాగే, ఏపీకి జీవనాడి అయిన పోలవరాన్ని వేగంగా పూర్తి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తాయని ప్రధాని మోడీ అన్నారు.
Read Also: PM Modi: అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన!
ఇక, నెల్లూరులోని శ్రీహరికోట నుంచి జరిగే ప్రయోగాలు.. దేశం మొత్తాన్ని గర్వపడేలా చేస్తాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. మన ఆయుధాలే కాదు.. ఐకమత్యమే మన ప్రధాన బలం అన్నారు. విశాఖలో ఏక్తా మాల్.. హస్తకళల నిపుణులకు చేయూతనిస్తుందని పేర్కొన్నారు. అయితే, అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21న) రోజున నేను ఏపీకి వస్తున్నాను.. చంద్రబాబు ఆహ్వానం మేరకు నేను యోగా దినోత్సవం రోజున.. రాష్ట్రంలో పర్యటిస్తాను అని వెల్లడించారు. వచ్చే 50 రోజులు.. ఏపీలో యోగాకు సంబంధించిన విస్తృత కార్యక్రమాలు జరగాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.