పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే సింధు జలాలు నిలిపివేసింది. అనంతరం వీసాలను రద్దు చేసింది. అటారీ సరిహద్దు మూసివేసింది. పాకిస్థాన్ యూట్యూబ్ ఛానళ్లు నిలిపివేసింది. తాజాగా భారత్ మరో కఠిన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌తో పూర్తిగా వాణిజ్యం రద్దు చేసింది. ఎగుమతులు, దిగుమతులు నిలిపివేసింది. ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఆంక్షలు అమల్లోకి రానున్నట్లు తెలిపింది. దొడ్డిదారిన పాక్ వస్తువులు దేశంలోకి రాకుండా పరోక్ష దిగుమతులను కూడా బ్యాన్ చేసింది. పాక్‌ను దారికి తెచ్చేందుకు భారత్ ఒక్కొక్కటిగా కఠిన చర్యలు చేపడుతోంది. తాజా నిర్ణయంతో పాక్‌కు మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి: Kishan Reddy: మే 5న అంబర్‌పేట్ ప్లై ఓవర్‌ను గడ్కరీ ప్రారంభిస్తారు
పాకిస్థాన్ నుంచి వచ్చే అన్నిరకాలా వస్తువుల ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై నిషేధం విధిస్తున్నామని.. అనుమతులు ఉన్న ఉత్పత్తులైనా, స్వేచ్ఛాయుత దిగుమతులైనా సరే పాక్ నుంచి ఎలాంటి వస్తువులను అనుమతించబోమని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని.. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని చెప్పింది. ఈ నిషేధం నుంచి ఏవైనా మినహాయింపులు కావాలంటే.. భారత ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని వాణిజ్య మంత్రిత్వ శాఖ తమ నోటిఫికేషన్‌లో వెల్లడించింది.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల కొద్దీ గాయపడ్డారు. ఈ దాడిలో నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నారు. వీరంతా పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లుగా దర్యాప్తు సంస్థ గుర్తించింది. ఇక ఉగ్రవాదులు ప్రస్తుతం దక్షిణ కాశ్మీర్‌లోని దట్టమైన అడవుల్లో ఉన్నట్లుగా అధికారాలు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Sumanth : అక్కినేని ఇంట మోగనున్న మరో పెళ్లి బాజా.. !