విశాఖలో జూన్ 21న జరగనున్న యోగా డేలో తాను పాల్గొంటానని, తనను ఆహ్వానించినందుకు సీఎం చంద్రబాబుకు థ్యాంక్స్ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వచ్చే 50 రోజులు ఏపీలో యోగాకు సంబంధించిన విస్తృత కార్యక్రమాలు జరగాలన్నారు. ఏపీలో కలలు కనేవాళ్ల సంఖ్య తక్కువేం కాదని, ఆ కలల్ని నిజం చేసే వారి సంఖ్యా తక్కువ కాదన్నారు. వచ్చే మూడేళ్లలో అమరావతి పనుల్ని పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారని, ఆ పనులు పూర్తయ్యాక ఏపీ జీడీపీ ఏ స్థాయికి వెళ్తుందో తాను ఊహించగలను అని ప్రధాని పేర్కొన్నారు. అమరావతి పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ప్రధాని మోడీ మాట్లాడారు. ప్రధాని తన ప్రసంగాన్ని తెలుగులో మొదలు పెట్టి తెలుగు ప్రజలను ఆశ్చర్యపరిచారు.
Also Read: PM Modi: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. చంద్రబాబును చూసి నేర్చుకొన్నా!
‘జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున నేను ఏపీకి వస్తున్నాను. సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు యోగా దినోత్సవం రోజున ఏపీలో పర్యటిస్తాను. నన్ను ఆహ్వానించినందుకు సీఎం, ప్రభుత్వానికి ధన్యవాదాలు. మన యోగాకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. వచ్చే 50 రోజులూ ఏపీలో యోగాకు సంబంధించిన విస్తృత కార్యక్రమాలు జరగాలి. ఏపీలో కలలు కనే వాళ్ల సంఖ్య తక్కువేం కాదు, ఆ కలల్ని నిజం చేసేవారి సంఖ్యా తక్కువ కాదు. ఏపీ సరైన మార్గంలో నడుస్తోంది, సరైన వేగంతో ముందుకెళ్తోంది.. దీన్ని ఇలానే కొనసాగించాలి. వచ్చే మూడేళ్లలో అమరావతి పనుల్ని పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఆ పనులు పూర్తయ్యాక ఏపీ జీడీపీ ఏ స్థాయికి వెళ్తుందో నేను ఊహించగలను’ అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.