PM Modi: 2008 జైపూర్ వరస పేలుళ్ల నిందితులను నిర్దోషిగా విడుదల చేయడాన్ని ప్రధాని నరేంద్రమోడీ తప్పపట్టారు. రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం బుజ్జగింపు విధానాన్ని అవలంభిస్తోందని, ఉగ్రవాదులపై మెతక వైఖరి ప్రదర్శిస్తోందని ప్రధాని ఆరోపించారు. రాజస్థాన్‌లోని అబురోడ్‌లో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ,
Sehar Shinwari : అవినీతి ఆరోపణల నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టయ్యారు. అప్పటి నుంచి దేశంలో అల్లర్లు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితిపై పాక్ నటి సెహర్ షిన్వారీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పర్యాటకుల బృందంతో వెళ్తున్న పడవ మునిగిపోవడం వల్ల 21 మంది మరణించారు. ఈ విషాద ఘటన కేరళలో చోటుచేసుకుంది. కేరళలోని మలప్పురం జిల్లా తానూర్ ప్రాంతంలోని తువల్తిరం బీచ్ సమీపంలో ఆదివారం సాయంత్రం 30 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న హౌస్‌బోట్ బోల్తా పడి మునిగిపోవడంతో మహిళలు, పిల్లలతో సహా కనీసం 21 మంది మరణించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
PM Modi: కర్ణాటకలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలు విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వరసగా రెండో రోజు బెంగళూర్ నగరంలో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. అంతకుముందు రోజు శనివారం మూడు గంటల పాటు మోదీ రోడ్ షో జరిగింది. దాదాపుగా 13 నియోజకవర్గాలను కవర్ చేస్తూ శనివారం నగరంలో దాదాపు 26 కి.మీ రోడ్‌షో నిర్వహించిన ప్రధానిని చూసేందుకు భారీగా ప్రజలు రోడ్డుకిరువైపుల…
PM warangal tour: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ రాష్ట్రంలో వరుస పర్యటనలు, కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. కర్ణాటక ఎన్నికల్లో బిజీబిజీగా ఉన్న ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితర కీలక నేతలు ఇక తెలంగాణపై దృష్టి సారించారు.
ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో రోడ్‌షో నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఓ వైపు మణిపూర్‌లో హింస చెలరేగి తగలబడుతుంటే.. జమ్మూకశ్మీర్‌లో సైనికులు చనిపోతుంటే ప్రధాని కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, రోడ్ షోలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.
PM Modi: కర్ణాటక ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకోబోతోంది. ఎన్నికలకు మరో నాలుగు రోజులే మిగిలి ఉన్నాయి. ప్రచారానికి మరో రెండు రోజుల మాత్రమే మిగిలి ఉంది. ఈ రోజు బెంగళూర్ నగరంలో ప్రధాని నరేంద్రమోడీ మెగా రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు.
The Kerala Story: వివాదాలకు కేంద్రబిందువుగా నిలుస్తోంది ‘ది కేరళ స్టోరీ’ సినిమా. ఇప్పటికే ఈ సినిమాపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ సినిమా విడుదల చేయకుండా స్టే ఇవ్వాలని పలువురు సుప్రీంకోర్టు, కేరళ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ..కోర్టులు అందుకు నిరాకరించాయి. దీంతో శుక్రవారం దేశవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద భద్రతను కల్పించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకు టాక్స్ ఫ్రీ ప్రకటించింది.