ప్రధాని మంత్రి కిసాన్ యోజన 14వ విడత డబ్బులు త్వరలోనే రైతుల అకౌంట్లలో పడే అవకాశం ఉంది. ఈ సారి 3 కోట్ల మంది రైతులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం దక్కడం లేదు. దీనికి ప్రధాన కారణం ఈకేవైసీ పూర్తి చేయకపోవడమే అని తెలుస్తోంది.. అయితే వీలైనంత త్వరగా EKYC పూర్తి చేయాలని.. లేకపోతే రూ.2వేలు ఖాతాలో పడవని రైతులకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది.
Read Also: Nandakumar: GHMC కమిషనర్ పై చర్యలు తీసుకోండి.. హైకోర్ట్ ను ఆశ్రయించిన నందకుమార్
అయితే రైతుల ఖాతాల్లో డబ్బులు పడేందుకు ఇంకా సమయం ఉంది. మీరు మీ eKYCని స్వయంగానూ లేదా మీ సేవా సెంటర్ కు వెళ్లి పూర్తి చేసుకోవచ్చు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి సొమ్మును ప్రభుత్వం సంవత్సరానికి మూడుసార్లు బదిలీ చేస్తుంది. దీని కాల వ్యవధి కూడా నిర్ణయించబడింది. ఏప్రిల్ 1 మరియు జూలై 31 మధ్య మొదటి విడతగా డబ్బును కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేయనుంది. రెండో విడత ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 మధ్య.. మూడో విడత డిసెంబర్ 1 నుంచి మార్చి 31 మధ్య జమ చేయబడతాయి.
Read Also: Variety Thief: అట్టముక్కతో దొంగతనం.. అడ్డంగా దొరికిపోయిన దొంగ
eKYC అప్ డేట్ చేసుకునే విధానం..
1.. PM-కిసాన్ స్కీమ్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి (https://pmkisan.gov.in/). దాని రైతు సెక్షన్ లోకి వెళ్లి, ఆధార్ వివరాలను ఎడిట్ చేసి.. ఎంపికపై క్లిక్ చేయండి.
2.. మీరు అక్కడ మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి.. దీని https://pmkisan.gov.in/తర్వాత క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయడం ద్వారా సమర్పించండి.
3.. దరఖాస్తులో మీ పేరు( తప్పుగా) – మరియు ఆధార్ భిన్నంగా ఉంటే, మీరు దాన్ని ఆన్‌లైన్‌లో సరిదిద్దుకోవచ్చు.
4.. ఏదైనా ఇతర తప్పులు ఉంటే, మీరు వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలి.
5.. అంతే కాకుండా వెబ్‌సైట్‌లో ఇచ్చిన హెల్ప్‌డెస్క్ ఆప్షన్‌పై క్లిక్ చేసిన తర్వాత ఆధార్ నంబర్, ఖాతా నంబర్, మొబైల్ నంబర్‌ను నమోదు చేసిన తర్వాత అన్ని తప్పులను సరిదిద్దవచ్చు. ఆధార్ నంబర్‌లో సవరణ, స్పెల్లింగ్ మిస్టేక్ వంటి అన్ని తప్పులను సరిచేసుకోవచ్చు..
6.. మీ డబ్బు ఎందుకు నిలిచిపోయింది అనే దాని గురించి కూడా మీరు సమాచారాన్ని పొందుతారు.. తద్వారా మీరు తప్పులను సరిదిద్దుకోవచ్చు.
Read Also: Mumbai : ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేసినందుకు భార్యకు త్రిపుల్ తలాక్ చెప్పిన భర్త..
పొరపాటున మీ డబ్బు ఆగిపోతే ఏం చేయాలంటే..?
ఏదైనా పత్రంలో ఏదైనా లోపం కారణంగా తరచుగా డబ్బు నిలిచిపోతుంటే.. ఆధార్, ఖాతా నంబర్. బ్యాంక్ ఖాతా నంబర్లలో చాలా సాధారణ తప్పులు ఉంటే.. మీరు రాబోయే వాయిదాల్లో డబ్బును పొందలేరు. కనుక.. మీరు కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ని సందర్శించడం ద్వారా ఈ తప్పులను సరిదిద్దుకోవచ్చు. అయితే ఇంట్లో కూర్చొని ఈ తప్పులను సరిదిద్దుకోవచ్చు. ఈ పథకానికి సంబంధించి ఏ రైతుకైనా ఏదైనా సమస్య ఉంటే.. ప్రభుత్వం అందించిన హెల్ప్‌లైన్ నంబర్- 155261 లేదా 1800115526 (టోల్ ఫ్రీ) లేదా 011-23381092 నంబర్‌కు సంప్రదించి ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు.