Harish Rao: పుట్టుక నుండి చావు దాకా ప్రజలకు ఏం కావాలో ఆలోచించింది సీఎం కేసీఆర్ అని ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. KPHB డివిజన్ 5 వ ఫేస్ లోధ టవర్స్ సమీపంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రెండేళ్ల పాటు కష్ట పడి మీ ఎమ్మెల్యే ఈ ఆసుపత్రి వచ్చేలా కృషి చేశారని అన్నారు. 1000 పడకల టిమ్స్ ఆసుపత్రి వస్తుంది, పఠాన్ చెరు లో మరొక సూపర్ స్పెషాలిటీ వస్తుందని అన్నారు. ఇవి ఉన్నా కూడా మీ ఎమ్మెల్యే పట్టుబట్టి ఆసుపత్రి సాధించారని తెలిపారు. కూకట్ పల్లిలో చెరువు బాగైంది, రైతు బజార్ బాగైందన్నారు. పి.జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నీళ్ళ కోసం నాడు ధర్నాలు చేశారని అన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు తెలంగాణలో లేవని తెలిపారు. మహారాష్ట్రలో 9 రోజులకు నీళ్ళు వచ్చే ప్రాంతాలు ఉన్నాయని, హైదరాబాద్ నీటి కష్టాలు తీర్చిండు కేసీఆర్ అని గుర్తు చేశారు. ఇన్వర్తర్లు లేవు, కన్వర్తర్లు లేవు, జనరేటర్లు లేవు అన్నారు.
హైదరాబాద్ లోనే కాదు, పల్లెల్లో కూడా 24 గంటల నిరంతర కరెంట్ సీఎం ఇస్తున్నారని అన్నారు. తెలంగాణ రాకముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 30 శాతం ఉంటే, మే నెలలో అవి 70 కి చేరాయని గుర్తుచేశారు. మన దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు. కష్ట పడి పని చేస్తే ఇదంతా సాధ్యం అయ్యిందని హరీశ్ రావు అన్నారు. నాడు 20 ఏళ్లకు ఒక్క మెడికల్ కాలేజీ పెట్టారు.. 9 ఏళ్లలో 21 మెడికల్ కాలేజీలు ప్రారంభించామని అన్నారు. వైద్య విద్య కోసం ఉక్రెయిన్, చైనా వెళ్లాల్సిన పరిస్థితి లేదని అన్నారు. డాక్టర్ల కొరత ఎక్కువగా ఉండే.. నాడు ఎంబిబిఎస్ సీట్లు 2950 ఉంటే నేడు 8340 సీట్లు ఉన్నాయని మంత్రి అన్నారు. పక్కా తెలంగాణలో ఉండి మన బిడ్డలు డాక్టర్ కావొచ్చని హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ వాళ్ళు మేమే ఇచ్చినం మెడికల్ కాలేజీలు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్కో మెడికల్ కాలేజీ మీద తెలంగాణ 500 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. NMC అటానమస్ బాడీ అనుమతి ఇస్తుందన్నారు. జుటా ప్రచారం బీజేపీది అంటూ నిప్పులు చెరిగారు. ఇంత దారుణం ఉండద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మందికి పుట్టిన బిడ్డ మాదే అని ముద్దాడినట్టు ఉంది. 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణ కు ఒక్కటి ఇవ్వలేదన్నారు. బాత్ రూం మీద బొమ్మ అడిగినోల్లు, సిలిండర్ మీద కూడా పెట్టాలని అడగాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 14 నుండి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం చేయబోతున్నామమన్నారు. ఎవరు అడగక ముందే సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని తెలిపారు. తల్లి బలంగా ఉంటే పుట్టే పుట్టబోయే బిడ్డ బాగుంటదనీ కిట్స్ ఇస్తున్నామని అన్నారు. తల్లి, బిడ్డకు సీఎం కేసీఆర్ కానుక ఇది అని, బిడ్డ కడుపులో పడితే ఇచ్చేది న్యూట్రిషన్ కిట్, బిడ్డ పుడితే కేసీఆర్ కిట్ అంటూ మంత్రి అన్నారు. పుట్టుక నుండి చావు దాకా ప్రజలకు ఏం కావాలో ఆలోచించింది సీఎం కేసీఆర్ మాత్రమే అన్నారు. ఢిల్లీలో అవార్డులు ఇస్తారు, గల్లీలో తిడుతరంటూ మండిపడ్డారు. ప్రజలు ఆలోచించాలి. పని చేసే వారిని ఆశీర్వదించాలని కోరుతున్నా అని మంత్రి హరీశ్ రావు అన్నారు.
Ashok Gehlot: వారికి రెచ్చగొట్టడమే తెలుసు.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఖాయం