Rahul Gandhi: కర్ణాటక ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నువ్వానేనా అన్నరీతిలో ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ తరుపున ప్రధాని నరేంద్రమోదీ, జేపీనడ్డా, అమిత్ షాలు కర్ణాటకలో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీలు స్టార్ క్యాంపెనర్లుగా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీపై విరుచుకుపడ్డారు. మంగళవారం తీర్థహళ్లిలో ప్రచారం చేస్తున్న ఆయన మోడీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు.
ఆస్ట్రేలియాలో మే 24న సమావేశానికి.. క్వాడ్ లో సభ్య దేశాలైన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని కిషిడా ఫుమియో, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ పాల్గొంటారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పార్టీ అగ్రనేతలు కోరితే తాను తన పదవికి రాజీనామా చేస్తానని అన్నట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి.
Jairam Ramesh: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రధాని నరేంద్రమోడీ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోంది, కానీ కాంగ్రెస్ మాత్రం స్థానికతకు పెద్ద పీట వేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాంరమేష్ అన్నారు. నాలుగు ఏళ్ల బీజేపీ పాలన తర్వాత కర్ణాటక ప్రజలకు విటమిన్-పి కావాలని ఆయన అన్నారు.
PM Modi: కర్ణాటక ఎన్నికలకు మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు శక్తివంచన లేకుండా అధికారం కోసం ప్రచారం చేస్తున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్రమోదీ పెద్ద ఎత్తున ప్రచారకార్యక్రమాలను ప్రారంభించారు. ఆదివారం కోలార్ ప్రాంతంలో ఆయన ప్రచారం చేశారు. కోలార్ లో జరిగిన సభ కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు నిద్రపట్టకుండా చేస్తుందని అన్నారు. ఈ రెండు పార్టీలు కర్ణాటక అభివృద్ధికి అవరోధంగా తయారయ్యాయన్నారు. ప్రజలు వాటిని క్లీన్ బౌల్డ్ చేశారని, కాంగ్రెస్, జేడీఎస్ అవినీతి…
Shivraj Singh Chouhan: ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన విమర్శలు వివాదాస్పదం అయ్యాయి. ప్రధాని మోడీని ‘విషసర్పం’తో పోల్చడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇదిలా ఉంటే బీజేపీ నేత, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఖర్గేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీని శివుడి(నీలకంఠుడు)తో పోల్చారు. ప్రధాని దేశ ప్రజల కోసం విషాన్ని భరిస్తున్నారని అన్నారు. ప్రధాని సుసంపన్నమైన, శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మిస్తున్నారని అన్నారు.
100th Episode Of PM Modi's 'Mann Ki Baat': ప్రధాని నరేంద్ర మోడీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం మరో ఘనతను సాధించింది. ఏప్రిల్ 30న మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ లో ప్రధాని మాట్లాడనున్నారు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ‘‘ ప్రధాన మంత్రి ‘‘మన్ కీ బాత్’’ 100వ ఎపిసోడ్ ఏప్రిల్ 30న యూఎన్ హెడ్ క్వార్టర్స్ లోని ట్రస్టీషిప్ కౌన్సిల్ ఛాంబర్…
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ వేగం పెంచారు. ఎన్నికల ప్రచారంలో విపక్ష కాంగ్రెస్పై ఆయన మండిపడ్డారు. విపక్ష పార్టీ ఇప్పటివరకు తనను 91 సార్లు దూషించిందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. అలా చేసిన ప్రతీసారి ఆ పార్టీ కుప్పకూలిపోయిందని విమర్శించారు.
Karnataka : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. అన్న పార్టీలు ఎలాగైనా గెలిచి అధికారం చేజిక్కించుకోవాలని పోరాడుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి.