ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతల విషయంలో గుజరాత్ హైకోర్టు తీర్పును మరోసారి సమీక్షించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. దీనిని స్వీకరించిన గుజరాత్ హైకోర్టు జస్టిస్ బీరన్ వైష్ణవ్ విచారణ అనంతరం కేసును జూన్ 30కి పడింది. ఈ నేపథ్యంలో గుజరాత్ యూనివర్శిటీ, కేంద్ర ప్రభుత్వం, మాజీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎం శ్రీధర్ ఆచార్యలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Read Also : Sureshbabu : సంచలన నిర్ణయం తీసుకోబోతున్న నిర్మాత సురేష్ బాబు..!!
ప్రధానమంత్రి మోడీ విద్యార్హతలు తెలియజేయాలంటూ 2016లో అరవింద్ కేజ్రీవాల్ సమాచార హక్కు చట్టం కమిషనర్ కు ఒక లేఖ రాశారు. దీనిపై స్పందించిన కమిషనర్ రాజనీతి శాస్త్రంలో మోడీ మాస్టర్స్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారని తెలిపారు. అయితే ఇదే అంశంపై కేజ్రీవాల్ ఢిల్లీ యూనివర్సిటీకి ఒక లేఖ రాశారు. మోడీ సర్టిఫికెట్ట్ ను యూనివర్సిటీ వెబ్ సైట్ లో ప్రచురించాలని ఆయన కోరారు.
Read Also : Bhagavanth Kesari : నటసింహం బాలకృష్ణ మాస్ ట్రీట్ చూశారా… అదిరిపోయిందిగా
దీంతో ప్రధాని మోడీ విద్యార్హతను వెల్లడించాలని ప్రధాని కార్యాలయం.. గుజరాత్ యూనివర్సిటీ.. ఢిల్లీ యూనివర్సిటీలను కోరారు సమాచార కమిషనర్. ఈ విషయం కోర్టుకి వెళ్లడంతో గుజరాత్ విశ్వవిద్యాలయాన్ని ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను గుజరాత్ హైకోర్టు పక్కన పెట్టేసింది. మోడీకి సంబంధించిన సర్టిఫికెట్లను సీఎంఓ బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని వెల్లడించింది. అంతేకాదు కేసు వేసిన కేజ్రీవాల్ కు రూ. 25 వేల జరిమానా విధించింది. అందుకు నాలుగు వారాల గడువు ఇచ్చింది.
Read Also : Yogi Government: 5 ఏళ్ల ట్రాఫిక్ చలాన్లు రద్దు.. యోగి సర్కార్ సంచలన నిర్ణయం
అయితే ఇప్పుడు తాజాగా అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాది గుజరాత్ హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ప్రధాని మోడీ డిగ్రీ పట్టాను ఆన్ లైన్ లో అందుబాటులో ఉందని గుజరాత్ యూనివర్సిటీ చెప్పిందని అయితే విశ్వవిద్యాలయ వెబ్ సైట్ లో అలాంటి డిగ్రీ అసలు అందుబాటులోనే లేదని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అంతేగాక కేజ్రీవాల్ కు విధించిన రూ. 25 వేల జరిమానా విషయంలో కూడా సమీక్షించాలని తెలిపారు.
Read Also : Union Bank of India: నేటి నుంచి ఏపీలోని 120 యూబీఐ శాఖల్లో ఈ సేవలు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విద్యార్హతలు తెలుసుకోవడం కోసం తను ఎలాంటి డిమాండ్ చేయలేదని సాధారణంగా ఒక లెటర్ ను మాత్రమే రాశానని దాన్ని సీఐసీ సుమోటగా స్వీకరించింది అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ రివ్యూ పిటిషన్ పై విచారణను గుజరాత్ హైకోర్టు ఈ నెల 30వ తారీఖుకు వాయిదా వేసింది.