సిద్దిపేట జిల్లా కొహెడ మండలం పెద్ద సముద్రాల వద్ద సిద్దిపేట నుండి ఎల్కతుర్తి వరకు జరుగుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనులను మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. సిద్దిపేట-ఎల్కతుర్తి 765 డీఎల్ జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 578 కోట్ల రూపాయలు కేటాయించింది అన్నారు. ప్రధాని మోడీ 9 సంవత్సరాలలో దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులకు లక్ష కోట్లు కేటాయించారు అని ఆయన తెలిపారు. తాను ఎంపీగా అయినప్పటి నుంచి నాలుగేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 వేల కోట్లకు పైగా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేశానని బండి సంజయ్ అన్నారు.
Read Also : US Layoffs : మేలో అమెరికాలో 80 వేలకు పైగా పోస్ట్లు ఊస్ట్… 3900 ఉద్యోగాలకు ఎసరుపెట్టిన AI
కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ కామెంట్స్: రానున్న రోజుల్లో తెలంగాణలో బండి సంజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. బండి సంజయ్ అడగ్గానే కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ సిద్దిపేట-ఎల్కతుర్తి జాతీయ రహదారి నిర్మాణానికి నిధులు కేటాయించారు అని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం తక్కువ, అవినీతి ఎక్కువ జరిగింది.. తెలంగాణలో 1948 నుంచి 2014 వరకు జాతీయ రహదారుల నిర్మాణానికి కేవలం 2,500 కోట్లు కేటాయిస్తే, కేవలం ఈ 9 ఏళ్లలో మోడీ ప్రభుత్వం జాతీయ రహదాల నిర్మాణానికి 2,500 కోట్లు కేటాయించింది అని అన్నారు.
Read Also : Pawan Kalyan: రాష్ట్ర శ్రేయస్సు కోరుతూ పవన్ కళ్యాణ్ హోమం
తొమ్మిదేండ్లలో ప్రధాని మోడీ పాలనపై గానీ.. కేంద్రంలోని ఒక్క మంత్రిపై, ఎంపీపై అవినీతి ఆరోపణలు రాలేదు అని కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. యూపీఏ ప్రభుత్వం కంటే రెండింతలు ఈ 9 ఏళ్లలో దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. తెలంగాణ కోసం ఆనాడు తాము కూడా కేంద్రంలో పోరాటం చేశాం.. కానీ తెలంగాణలో ఇప్పుడు ఒకే కుటుంబం అవినీతి పాలన కొనసాగిస్తుంది.. తొమ్మిదేళ్లలో మోడీ ప్రభుత్వం తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి 1 వేయి 900 కోట్ల రూపాయలు కేటాయించిందని కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు.