PM Modi: హిరోషిమాలో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ వెళ్లారు. శిఖరాగ్ర సమావేశానికి హాజరుకావడమే కాకుండా, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో సహా అనేక మంది ప్రపంచ నాయకులతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాలను కూడా నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలిడిమిర్ జెలన్ స్కీతో ప్రధాని నరేంద్రమోదీ సమావేశం అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య సమావేశానికి సంబంధించి ఇరు దేశాల దౌత్యవేత్తల మాట్లాడుతున్నట్లు సమాచారం.
గ్రూప్ ఆఫ్ సెవెన్ (జి7) సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జపాన్‌కు వెళ్లనున్నారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు ప్రధాని తూర్పు ఆసియా దేశాన్ని సందర్శిస్తున్నారు. శక్తివంతమైన సమూహం ప్రస్తుత అధ్యక్షుడిగా జపాన్ జీ7 సమ్మిట్‌ను నిర్వహిస్తోంది.
New Parliament: కేంద్ర ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్రమోదీ మే 28న ప్రారంభించనున్నారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం రోజు ప్రధాని నరేంద్రమోడీని కలిసి కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాల్సిందిగా ఆహ్వానించారు.
Etela Rajender: బీజేపీకి త్వరలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గుడ్ బై చెబుతున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వార్తలను ఈటల తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో రెండు ట్వీట్ లు చేశారు. తను పార్టీలు మార్చే వ్యక్తిని కానని స్పష్టం చేశారు. తన అభిప్రాయం తెలుసుకోకుండా ఇలాంటి వార్తలు రాయడం తగదని మండిపడ్డారు. ప్రధాన మంత్రి మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా…
JP Nadda: ఉచితాలపై బీజేపీ జాతీయాద్యక్షుడు జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో జపాన్, అమెరికా, చైనా దేశాలు ఉచితాలపై డబ్బులను ఖర్చు పెట్టాయని, ఇదే ఆ దేశాల్లో ఆర్థిక సంక్షోభానికి కారణం అయిందని అన్నారు. భారతదేశం మాత్రం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిందని.. ఇది మౌళిక సదుపాయాలు, వ్యవసాయం, ఇతర సెక్టార్లకు బూస్ట్ ఇచ్చిందని ఆయన అన్నారు.
PM Kisan: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం కిసాన్) పథకం కింద ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకు రైతులకు రూ.2,000 సహాయం అందిస్తుంది. పథకం కింద చెల్లుబాటు అయ్యే ఎన్రోల్మెంట్ ఉన్న రైతులకు మూడు సమాన షేర్లలో సంవత్సరానికి 6,000 ఇవ్వబడుతుంది.
Bandi Sanjay Kumar: మరో 5 నెలలు ఆగండి.. తెలంగాణ ప్రజలే కేసీఆర్ సర్కార్‌ను నిషేధించబోతున్నారు అని జోస్యం చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ తప్పిదాలపై ప్రశ్నంచే మీడియాను కూడా కేసీఆర్ ప్రభుత్వం నిషేధిస్తోంది. ఉద్యమించే నాయకులను అరెస్ట్ చేసి బెదిరిస్తోంది. మరో 5 నెలలు ఆగండి.. తెలంగాణ ప్రజలే కేసీఆర్ సర్కార్ ను నిషేధించబోతున్నారు అని పేర్కొన్నారు.. తెలంగాణ సబ్బండ వర్గాలు అల్లాడుతుంటే.. వందల కోట్ల ప్రజా ధనంతో…
గ్రూప్ ఆఫ్ సెవెన్ (G7), క్వాడ్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) సహా మూడు కీలక బహుపాక్షిక శిఖరాగ్ర సమావేశాలలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం జపాన్, పాపువా న్యూ గినియా, ఆస్ట్రేలియాలలో ఆరు రోజుల పాటు పర్యటించనున్నారని విదేశాంగ శాఖ ప్రకటించింది.
PM Rozgar Mela: 10 నెలలో పది లక్షల ఉద్యోగాలు భర్తీ ప్రక్రియను మోడీ నేరుగా చూస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. ఇవాళ పిఎం రోజ్ గార్ మేళ ప్రారంభంకానుంది.
Union Minister Kaushal Kishore: భారతదేశంలో నిరుద్యోగం లేకుండా చేయాలన్నది ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యమని తెలిపారు కేంద్రమంత్రి కౌషల్ కిషోర్.. విజయవాడ రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో 5వ రోజ్ గార్ (జాబ్) మేళాకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. విజయవాడ డివిజన్ పరిధిలో వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 300 మందికి నియామక పత్రాలు అందజేశారు.. రోజ్ గార్ కింద దేశ వ్యాప్తంగా పది లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి కల్పిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించగా..…