Israel: పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ గాజా ప్రాంతం నుంచి ఇజ్రాయిల్ పై భీకరదాడికి తెగబడింది. ఇప్పటికే పదుల సంఖ్యలో ఇజ్రాయిల్ పౌరులను కాల్చి చంపారు. పలువురిని మిలిటెంట్లు బందీలుగా పట్టుకున్నారు. మరోవైపు ఇజ్రాయిల్ సైన్యం గాజాపై ఎదురుదాడికి దిగింది. మిలిటెంట్లు, వారి స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేస్తోంది
Asian Games 2023: ఆసియా క్రీడలు 2023లో భారత్ చరిత్ర సృష్టించింది. చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు 100 పతకాలు సాధించింది.
అక్టోబర్ 13న జీ-20 పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు(P20 Summit)ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ సదస్సులో కెనడా కూడా పాల్గొననుంది. నిజానికి భారత్- కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
Putin: వెస్ట్రన్ దేశాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫైర్ అయ్యారు. భారత్, రష్యా బంధాన్ని పశ్చిమ దేశాలు విడదీయలేవని ఆయన అన్నారు. భారతదేశం తన ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తుందని, దీనివల్ల పాశ్చాత్య దేశాల ప్రభావం పడదని ఆయన పేర్కొన్నారు. సోచి నగరంలో రష్యాన్ బ్లాక్ సీ రిసార్టులో జరిగి ఓ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
విశాఖ ఉక్కు అప్పులను నష్టాలుగా చూపించి కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం అన్యాయం అంటూ సీతారాం ఏచూరి మండిపడ్డారు. వ్యవస్థను మొత్తం పెట్టుబడిదారుల చేతుల్లోకి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెడుతోంది అని ఆయన విమర్శలు గుప్పించారు.
PM Modi: కాంగ్రెస్ టార్గెట్గా మరోసారి ప్రధాని నరేంద్రమోడీ విరుచుకుపడ్డారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో మోడీ పర్యటించారు. ‘పేపర్ లీక్ మాఫియా’ రాజస్థాన్ లోని లక్షలాది మంది యువత భవిష్యత్తును నాశనం చేసిందని, సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జోధ్పూర్ లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేసిన ప్రతీ అవినీతి తమ వద్ద ఉందని, దానిని బయటకు తీసుకురావాలంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని మోడీ అన్నారు.
Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్రమోడీపై మరోసారి ప్రశంసలు కురిపించారు. ఆయన "చాలా తెలివైన వ్యక్తి" అని, మోడీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి చెంతుతోందని ఆయన పొగిడారు. ఆర్థిక భద్రత, సైబర్ నేరాలకు వ్యతిరేకంగా పోరాటంలో రష్యా, భారత్ మధ్య మరింత సహకారం ఉంటుందని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.